చిరంజీవి ఫెయిల్యూర్స్ పై సాయిధరమ్ తేజ్ సంచలన వ్యాఖ్యలు !

Seetha Sailaja
మెగా స్టార్ చిరంజీవిని అతడి సినిమాలలోని పాటలను అనుకరించకుండా ఒక్క సినిమా కూడ నటించని మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చిరంజీవి పరాజయాలను ఎత్తి చూపుతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. ప్రస్తుతం ఈ మెగా యంగ్ హీరో వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతూ ఏకంగా 5 డిజాస్టర్లను ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.

అయితే ఇంత షాక్ లు తగిలినా ఆ విషయం బయటకు కనిపించకుండా ఉత్సాహంగానే షూటింగ్ లో పాల్గొంటున్నాడు తేజ్. ఈ పరిస్థుతులలో ఈయంగ్ హీరో కరుణాకరన్ దర్సకత్వంలో నటిస్తున్న షూటింగ్ స్పాట్ లో తేజ్ కు బాగా సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి పలకరించి వరస పరాజయాల గురించి బాధ పడవద్దు అని ధైర్యం చెప్పినట్లు టాక్.

అయితే ఆ సలహాఇచ్చిన వ్యక్తి మైండ్ బ్లాంక్ అయ్యేలా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ చిరంజీవి గారికి వరుసగా 10 సినిమాలు ఫ్లాపులు వచ్చాయి. అవన్నీ సహజం. ఇంకా కష్టపడతా హిట్టొచ్చే వరకు శ్రమిస్తా ఇంకా శ్రమిస్తా అంటూ రివర్స్ క్లాస్ ఇచ్చినట్లు సమాచారం. దీనితో ఈమెగా యంగ్ హీరో ధైర్యం చూసి సాయి ధరమ్ తేజ్ కు సానుభూతి చూపించిన ఆ ప్రముఖ వ్యక్తి షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. 

1992-95 మధ్య చిరంజీవి నటించిన ‘ఆజ్ కా గూండా రాజ్’ ‘మెకానిక్ అల్లుడు’ ‘ముగ్గురు మొనగాళ్ళు’ ‘ఎస్ పి పరుశురామ్’ లాంటి అనేక సినిమాలు వరస పరాజయాలు పొందడంతో ఒకానొక సమయంలో చిరంజీవి మేకప్ వేసుకోకుండా ఏకంగా ఏడాది ఖాళీగా ఉన్న సంగతి వాస్తవం. అయితే ఆతరువాత చిరంజీవి నటించిన ‘హిట్లర్’ సినిమాతో తిరిగి ట్రాక్ లోకి వచ్చాడు మెగా స్టార్. ఈ విషయాలు అన్నీ వాస్తవాలే అయినా ఏకంగా చిరంజీవి పరాజయాలతో తన ఫెయిల్యూర్స్ ను పోల్చుకోవడం విషయంలో సాయి ధరమ్ తేజ్ మితిమీరిన ఆత్మ విశ్వాసం ప్రదర్శిస్తున్నాడనుకోవాలి..  
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: