శ్రీదేవి.. ఆ "ఒక్క హీరో"కే ఎందుకు "నో" చెప్పింది..?

Chakravarthi Kalyan
శ్రీదేవి.. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ... దాదాపు ఐదు భాషల్లో నటించింది. ఎందరో స్టార్ హీరోల సరసన నటించి ప్రశంసలు అందుకుంది. తెలుగులో అయితే ఆమె దాదాపు మూడు తరాల నటులతో నటించి  అలరించింది. చివరకు తండ్రులతోనూ.. కొడుకులతోనూ నటించిన అరుదైన నటి శ్రీదేవి. సహజంగా ఈ క్రెడిట్ హీరోలకు ఉంటుంది. 


చాలా మంది హీరోలు.. తల్లులతోనూ.. వారి కూతుళ్లతోనూ హీరోలుగా నటిస్తారు. హీరోల లైఫ్ పీరియడ్ ఎక్కువ కాబట్టి ఆ ఛాన్స్ ఉంటుంది. కానీ శ్రీదేవి విషయంలో ఇది రివర్స్ అన్నమాట. ఏ ఎన్నార్ తో ఎన్నో ప్రేమ, కుటుంబ కథా చిత్రాల్లో నటించిన శ్రీదేవి.. ఆ తరవాత నాగార్జున సరసన కూడా హీరోయిన్ గా నటించిడం విశేషం. 


నాగార్జునతో మొదట 1988లో ఆఖరి పోరాటం చిత్రంలో నటించారు.  ఆ తర్వాత ఆరేళ్ల అనంతరం 1994లో గోవిందా.. గోవిందా సినిమాలోనూ నటించారు. ఇక తెలుగులో అప్పటి టాప్ స్టార్స్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున.. ఇలా అందరితోనూ జట్టు కట్టారు. కానీ శ్రీదేవి అప్పటి టాప్ హీరోల్లో ఒకరైన బాలకృష్ణతో మాత్రం నటించలేదు. 


వీరి కాంబినేషన్ లో ఓ సినిమా తీసేందుకు ప్రయత్నాలు జరిగాయని చెబుతారు. కానీ ఎన్టీఆర్ జోక్యంతో ఆ ప్రయత్నాలు ఆగిపోయాని అంటుంటారు. మరో వాదన ప్రకారం శ్రీదేవే బాలకృష్ణతో నటించేందుకు ఇష్టపడలేదని అంటుంటారు. రామారావుగారితో చాలా సినిమాలు హీరోయిన్ గా చేశానని.. బాలయ్యతో చేస్తే బావుండని ఆమె అభ్యంతరం చెప్పారట. మొత్తం మీద శ్రీదేవి బాలయ్య ఒక్కరితోనే హీరోయిన్ గా నటించలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: