నాగశౌర్య ప్రమోషన్ వెనుక చిరంజీవి ఆంతర్యం !

Seetha Sailaja

దాసరి నారాయణరావు మరణం తరువాత చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దగా మారిపోతున్నాడు. ఫిలిం ఇండస్ట్రీకి జరిగిన ఏ ఫంక్షన్ జరిగినా అదేవిధంగా సినిమాల ఆడియో లాంచింగ్ ఫంక్షన్స్ కు సంబంధించి ప్రస్తుతం అందరూ అతిధిగా చిరంజీవినే పిలుస్తున్నారు.

 

మెగా స్టార్ కూడ తనకు వీలైనంతవరకు అందరి ఫంక్షన్స్ కు వెళ్లి తాను అందరివాడిని అని తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈమధ్య చిరంజీవి లుక్ లో మార్పులు రావడంతో ఆయనకు ఏమైంది అంటూ కొందరు ఖంగారు పడుతున్నారు. ఈ కామెంట్స్ చిరంజీవి వరకు చేరడంతో తాను నటిస్తున్న ‘సైరా’ నిర్మాణం పూర్తి అయ్యేవరకు బయట సినిమా ఫంక్షన్స్ కు రాకూడదు అన్న నిర్ణయం చిరంజీవి తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

అయితే అనూహ్యంగా యంగ్ హీరో నాగశౌర్య కోసం చిరంజీవి తన నిర్ణయాన్ని కొద్దిగా మార్పు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ యంగ్ హీరో నటిస్తున్న ‘ఛలో’ ప్రీ రిలేజ్ ఫంక్షన్ కు చిరంజీవి ముఖ్య అతిధిగా రాబోతున్నట్లు టాక్. నాగ శౌర్య తన తల్లితో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్ళడం ‘ఛలో’ మూవీ ఫంక్షన్ కు చిరంజీవి అంగీకారాన్ని పొందడం అన్నీ వేగంగా జరిగిపోయాయి.

 

ఈ ఫంక్షన్ జనవరి 25న హైదరాబాద్ లో జరగబోతోంది. ఈమధ్య కాలంలో నాగశౌర్య నటించిన సినిమాలు అన్నీ పరాజయం చెందుతున్న విషయం తెలిసిందే. దీనితో ‘ఛలో’ మూవీ పై ఈ యంగ్ హీరో చాల ఆశలు పెట్టుకున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో నాగ శౌర్యను చిరంజీవి ప్రమోట్ చేయడం ఒక విశేషం అయితే కొద్ది కాలం వరకు చిరంజీవి పబ్లిక్ ఫంక్షన్స్ కు దూరంగా ఉండబోతున్న నేపధ్యంలో తీరిక చేసుకుని ఈచిన్న హీరో సినిమా ఫంక్షన్ కు చిరంజీవి ప్రత్యేకంగా రాబోతు ఉండటం వెనుక కారణం ఏమిటి అని మరికొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు..

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: