మెగా ఫ్యామిలీ ని ఒకటి చేస్తున్న రేయ్...
మెగా బ్రదర్స్ ముద్దుల చెల్లెలు కుమారుడు సాయిధర్మతేజ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ దర్శకుడు నిర్మాత వైవిఎస్ చౌదరి నిర్మిస్తున్న ‘రేయ్’ సినిమాను నిర్మిస్తున్నది పేరుకు చౌదరి అయినా వెనక ఉండి నడిపించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు. చాలాకాలంగా నిర్మాణంలో ఉన్న ఈసినిమాను భారీ బడ్జెట్ తో తీసారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా స్టిల్స్ లోని హీరో సాయిధర్మతేజను చూసిన వారంతా చిన్నప్పటి చిరంజీవిలా సాయిధర్మతేజ్ లా ఉన్నాడని అంటున్నారు.
రకరకాల వివాదాలతో భేదాభిప్రాయాలతో ఎడమొహం పెడమొహం గా ఉన్న మెగా ఫ్యామిలీని ఒక చోట కలిపే వేడుకగా ఈ సినిమా ఆడియో ఉండబోతుందని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రధానకారణం సాయిధర్మతేజ్ అంటే మెగా బ్రదర్స్ ముగ్గురుకి బాగా ప్రేమట. ఈ ప్రేమే ఈ మెగా ఫ్యామిలీని ఒకచోటకు తీసుకు వస్తుందని ఈ నెలాఖరున జరిగే ఈ సినిమా ఆడియో వేడుకకు టోటల్ మెగా కుటుంబం వస్తామని హీరో సాయిధర్మతేజ్ కు మాట ఇచ్చారని అంటున్నారు. ప్ర
స్తుత రాజకీయ వాతావరణంలో వేడెక్కిపోతున్న మెగా అభిమానులకు ఈ వార్త చాల ఆనందాన్ని కలిగింస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటి షబ్నా అజ్మి మేనకోడలు హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు 30 కోట్లు ఖర్చు పెట్టడం టాలీవుడ్ టాక్ గా మారింది. అన్నీ అనుకూలిస్తే ఈ సినిమా విజయదశమికి వస్తుంది అంటున్నారు...