మానవత్వం చాటుకున్న మెగాస్టార్..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో మకుటం లేని మహరాజుగా వెలిగిపోయిన హీరో మెగాస్టార్ చిరంజీవి.  ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన మెగాస్టార్ ‘శంకర్ దాదా జిందాబాద్’ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు.  ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి కేంద్ర మంత్రి బాధ్యతలు నిర్వహించారు.  దాదాపు పది సంత్సరాల తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో మరోసారి అభిమానుల ముందుకు వచ్చారు.  అప్పటి వరకు చిరుపై రక రకాల రూమర్లు పుట్టుకొచ్చాయి..ఆయన ఇక సినిమాలకు పనికిరారని..చిరు స్టామినా పడిపోయిందని అన్నారు.

కానీ ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం చూసిన తర్వాత అందరూ షాక్..చిరంజీవి పది సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో..ఇప్పుడూ అలాగే ఉన్నారని బాస్ ఈజ్ బ్యాక్ అంటూ బ్రహ్మరథం పట్టారు. ఇక చిరంజీవి కేవలం నటుడు, రాజకీయ నాయకుడిగానే కాకుండా సామాజిక సేవా హృదయం కలిగిన వారు.  చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తో ఎంతో మంది ప్రాణాలు కాపాడారు.  అంతే కాదు ఎంతో మందికి గుప్త దానాలు చేసి వారిని కష్టాల నుంచి దూరం చేశారు.  తాజాగా చిరంజీవి తన మానవత్వం మరోసారి చాటుకున్నారు.

గత కొంత కాలంగా వెండితెర, బుల్లితెరపై ఎన్నో కామెడీ పాత్రలు వేసిన గుండు హనుమంత రావు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో ఓ టెలివిజన్ లో ప్రసారమయ్య ‘ఆలీ తో జాలీ’గా షో ద్వారా గుండు హనుమంత రావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వెంటనే స్పందించి రూ.2 లక్షల రూపాయల చెక్ ‘మా ’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు శివాజీ రాజా ద్వారా అందజేశారు.  ‘మా’ జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్, కల్చరర్ కమిటీ చైర్మన్ సురేష్ కొండేటి, ఎగ్జ్యిక్యూటీవ్ మెంబర్ సురేష్ లు స్వయంగా అపోలో హాస్పిటల్ కి వెళ్లి గుండు హనుమంత రావు కి చెక్ అందించారు.

అంతే కాకుండా మరో కమెడియన్ పొట్టి వీరయ్య ఆర్థిక స్థితి గురించి చిరంజీవి సతీమణి సురేఖ ఓ పేపర్లో చదివి చలించిపోయారు.  తమ వంత సహాయంగా వీరయ్య కుటుంబానికి కూడా రూ.2 లక్షల రూపాయలు సహాయం చేశారు.  వీరయ్యను‘మా’ ఆఫీస్ కి పిలిపించి శివాజీరాజా, ఏడిద శ్రీరామ్ చేతుల మీదుగా రూ.2 లక్షల చెక్ ను అందించారు.  ఈ సందర్భంగా ‘మా ’ అధ్యక్షులు శివాజీ రాజా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ అవసరం వచ్చిన ఎవరు కష్టాల్లో ఉన్నా తాను ఉన్నానని భరోసా ఇచ్చే గొప్ప వ్యక్తి చిరంజీవి అని ఈ విషయాన్ని నేను ఓ నటుడిగా చాలా సంతోషంతో చెబుతున్నానని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: