సమంతలానే రెజినా.. పెద్దింటి కోడలు కాబోతుందా..!

shami
సౌత్ లో స్టార్ గా ఎదిగిన సమంత తన మొదటి సినిమా హీరో నాగ చైతన్యను పెళ్లాడింది. ఏమాయ చేశావే సినిమాతో మొదలైన చైతు సమంతల పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకునేలా చేసింది. ఇక నిన్నటిదాకా ఓ స్టార్ హీరోయిన్ అయిన సమంత ఒక్కసారిగా పెద్దింటి కోడలు అయ్యింది. ఇక ఇప్పుడు మరో తెలుగు హీరోయిన్ కూడా మరో స్టార్ ఫ్యామిలీని ఎంచుకుందట.


మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్, రెజినాల గురించి ఈ న్యూస్ అని తెలిసిందే.. ముందు తమిళంలో ఆ తర్వాత తెలుగులో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రెజినా సాయి ధరం తేజ్ తో నటించిన రెండు సినిమాలకే వారి మధ్య ప్రేమ చిగురించిందట. అయితే ఈ విషయంపై ఇద్దరు కాదు లేదు అన్నట్టు కనిపిస్తున్నా ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందని టాక్.


మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ అయితే రెజినా పెళ్లి విషయం మెగా ఫ్యామిలీ పెద్దల దాకా తీసుకెళ్లాడని అంటున్నారు. ఏది ఏమైనా సరే రెజినా తో సాయి ధరం తేజ్ రిలేషన్ ఏంటి అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. పెళ్లికి ముందు ఎలా ఉన్నా సరే పెళ్లి తర్వాత హీరోయిన్స్ కట్టు బొట్టులో మార్పు సహజమే.


మరి నిజంగానే రెజినా సాయి ధరం తేజ్ పెళ్లి చేసుకుంటారా లేదా అన్నది తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం తేజ్ జవాన్ సినిమాతో రాబోతున్నాడు. ఇక ఇదే కాకుండా వినాయక్ డైరక్షన్ లో సినిమా కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం కెరియర్ మీద దృష్టి పెట్టే ఆలోచనలో ఉన్న సాయి ధరం తేజ్ రెజినా విషయంలో ఏదో ఒక క్లియర్ కట్ గా చెప్పేస్తే బెటర్.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: