అర్జున్ రెడ్డిని తిట్టి పోస్తున్న అనసూయ !

Seetha Sailaja
హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ ఏదైనా విషయం పై తన అభిప్రాయాలను వెల్లడించడంలో ఎటువంటి మొహమాటాలకు తావు ఇవ్వకుండా సంచలన కామెంట్స్ చేస్తూ ఉంటుంది.  అంతేకాదు ఏ టాపిక్ పై అయినా ఈమె ఒక అభిప్రాయం చెప్పాలని భావిస్తే ఈమెను ఆపడం ఎవరి తరం కాదు అని అంటారు. 

ప్రస్తుతం సంచనాలు సృట్టిస్తున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ పై అనసూయ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘అంతా బాగానే ఉంది, కానీ అమ్మను తిట్టడం కూడా ఓకేనా ? కరెక్టే ఇదో ప్రయోగమే కానీ ఇలా చేసేయచ్చని ఎలా అనుకుంటారు, దీన్ని నేను ఇష్యూ చేయాలని అనుకోవడం లేదు. కానీ సైలెంట్ గా ఉండడం నావల్ల కాలేదు. ఇది చాలా చీప్ గా ఉంది’  అంటూ వ్యూహాత్మకంగా అర్జున్ రెడ్డిని కామెంట్ చేసింది. 

 అంతేకాదు ‘నీ జీవితంలో ఉన్న మహిళ గురించి మరొకరు ఇలాగే మాట్లాడితే అప్పుడేం చేస్తావ్ డూడ్, వారి లేడీస్ ను తిడతావా, అప్పుడు తేడా ఏంటి, ట్యాలెంటెడ్ వ్యక్తి తమ స్కిల్ ను సరిగా ఉపయోగించుకోవాలి, నైతికంగా ఉండాలి, ఫస్ట్ లుక్ చూసి అందరిలాగే నాకు కూడా మైండ్ బ్లాంక్ అయింది. కానీ పబ్లిక్ మీటింగ్స్ లో ఈసినిమా టీమ్ మాట్లాడిన పద్ధతి సరికాదు. ఇలాంటి మాటలు వినే ధైర్యం నాకు లేదు’ అంటూ చివరలో హ్యాష్ ట్యాగ్ పెట్టి అర్జున్ రెడ్డిని తీవ్రంగా టార్గెట్ చేసింది. 

అయితే ఈ కామెంట్స్ చూసిన చాలామందికి మాత్రం అనసూయ ‘అర్జున్ రెడ్డి’ సినిమాను తిడుతోందా లేక పోగుడుతోందా అనేవిషయం తెలియక తల పట్టుకుంటున్నారు. ప్రస్తుతం చాలామంది ప్రముఖులకు ‘అర్జున్ రెడ్డి’ ని తిట్టడం లేదా పొగడటం ఒక ఫ్యాషన్ గా మారిపోయిన నేపధ్యంలో అనసూయ కామెంట్స్ ఎవరికీ అర్ధంకానివిగా ఉన్నాయి అన్నది మాత్రం నిజం..   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: