దసరా రేసులో రామ్ దిగుతున్నాడు..!

shami
సంక్రాంతి తర్వాత లాంగ్ వీకెండ్ తో పాటుగా హాలీడేస్ టార్గెట్ తో వచ్చే సినిమాలు చాలానే ఉంటాయి. ఈ క్రమంలో దసరాకి బాక్సాఫీస్ పై పెద్ద యుద్ధం జరుగనుంది. సెప్టెంబర్ 21న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇప్పటికే రిలీజ్ కన్ఫాం చేసుకోగా మహేష్ కూడా సెప్టెంబర్ 27న రావడం కన్ఫాం అని తేలింది. వారం గ్యాప్ ఉన్నా ఎన్.టి.ఆర్, మహేష్ ఎవరికి వారు తమ బలాలు చాటాలని చూస్తున్నారు.   


ఇక ఈ రేసులో ఊహించని విధంగా తన సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. నేను శైలజ తర్వాత రామ్ కిశోర్ తిరుమల చేస్తున్న ఈ సినిమా దసరా 29న రిలీజ్ అవనుందట. అంటే ఎన్.టి.ఆర్ తర్వాత వారం గ్యాప్ తో మహేష్ వస్తుంటే ఆ తర్వాత రెండు రోజుల్లో రామ్ రానున్నాడట. 


దసరా బరిలో రామ్ పోటీకి రావడం కచ్చితంగా డేరింగ్ విషయమే అని చెప్పాలి. రామ్ కిశోర్ తిరుమల కాంబినేషన్ లో ఉన్నది ఒకటే జిందగి టైటిల్ ఎనౌన్స్ చేయడమే కాదు ఫస్ట్ లుక్ పోస్టర్ తో షాక్ ఇచ్చాడు రామ్. రామ్ ఎనర్జిటిక్ లుక్ తో కనిపిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు.      

ఎన్టీఆర్ జై లవ కుశ సెప్టెంబర్ 21, మహేష్ స్పైడర్ సెప్టెంబర్ 27 భారీగా రిలీజ్ అవుతుండగా ఈ రెండిటికి పోటీగా రామ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: