బూతులు మాట్లాడుతున్న మంచువారి అబ్బాయి...!

K Prakesh
బయట ఎలా ఉన్నా సరే ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలు హిట్ కావాలి అంటే బూతులు ఉండాల్సిందే. చిన్న హీరోల సినిమాలకు అయితే ఇది మరీ తప్పని సరి. లేకుంటే ప్రేక్షకులు ధియేటర్ లోకి రారు, ఆ సినిమా హీరోలను చూడరు. ‘బస్ స్టాప్’, ‘3జి లవ్” ఇలా ఈ సినిమాలు అన్నీ కేవలం బూతుల పైనే ఆధారపడి హిట్ అయ్యాయి.ఆఖరుకు పెద్ద దర్శకుల సినిమాలలో కూడా ఈ బూతు ప్రయోగాలు లేకుండా సినిమాలు రావడం లేదు.

మంచి నటుడుగా పేరున్న మంచువారి అబ్బాయి మనోజ్ కు పేరు అయితే ఉంది కాని చెప్పుకోవడానికి ఒక్క హిట్ కూడా లేదు. ఇక లాబం లేదు అనుకోని కాబోలు మనోజ్ కూడా ఈ బూతు చిత్రాల వైపే చూస్తున్నాడు అనుకోవాలి. త్వరలో రానున్న మనోజ్ సినిమా ;పోటుగాడు’ లో “బుజ్జి పిల్ల” అంటూ ఫారిన్ భామలను పొగుడుతూ ఫారిన్ లో చిత్రీకరించిన ఒక పాట ఉందట. ఈ పాటను సంగీత దర్శకుడు అచ్చు మ్యూజిక్ కంపోస్ చేశాడు. ఈ పాటను తమిళ్ క్రేజీ హీరో శింబు, మనోజ్ కోసం పాడాడు. ఇక ఈ పాట పల్లవి చూస్తే, ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవడం ఖాయం. ఒక సారి మీరే చదవండి మీకే అర్ధం అవుతుంది. “హల్లో నాటీ - వెళ్లదాం ఊటీ - నువ్వునేను లోన్లీ - కప్లింగ్ బూమ్ బూమ్” అంటూ ఈ పాట సాగుతుంది.

కప్లింగ్, బూమ్ బూమ్ అంటే ఏమిటో ఒక్కసారి గూగుల్ లోకి వెళ్లి చూస్తే ఎవరికైనా అర్ధం అవుతుంది. లేదంటే ప్రతి మనిషిలోని ఉండే మరొక యాంగిల్ ను తట్టిలేపి ఈ పదాల గురించి ఆలోచించినా వెంటనే అర్ధం అయిపోతుంది. మరి కుర్ర హీరోలతో తాను పోటికి రెడీ అంటూ మన మంచు మనోజ్ చేస్తున్న ఈ బూతు పాటల ప్రయోగం మనోజ్ కు సక్సెస్ ను తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: