సూపర్ స్టార్ మహేష్ ఏంటి ఏపి సిఎం చంద్రబాబుని స్పూర్తిగా తీసుకోవడం ఏంటని ఆశ్చర్యోవచ్చు. ప్రస్తుతం స్పైడర్ మూవీ చేస్తున్న మహేష్ ఆ తర్వాత కొరటాల శివ కాంబినేషన్ లో భరత్ అను నేను సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడని తెలిసిందే. త్వరలో రెగ్యులర్ షూట్ జరుపుకోనున్న ఈ సినిమాలో మహేష్ లుక్ సర్ ప్రైజింగ్ గా ఉంటుందని అంటున్నారు.
సిఎంగా మహేష్ పిల్లి గడ్డంతో కనిపిస్తాడట. అందుకే ఏపి సిఎం చంద్రబాబుని స్పూర్తిగా తీసుకుంటున్నాడని తెలుస్తుంది. మహేష్ మేనరిజం కూడా ఈ సినిమాలో కొత్తగా ఉంటుందట. ఇప్పటికే హైదరాబాద్ ఔట్ స్కట్స్ లో ఈ సినిమాకు సంబందించిన అసెంబ్లీ సెట్ కూడా వేయిస్తున్నారని తెలుస్తుంది. బాలీవుడ్ బికిని భామ కియారా అద్వాని హీరోయిన్ గా న సెలెక్ట్ అవగా సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.
సిఎంగా మహేష్ చంద్రబాబుని ఇమిటేట్ చేస్తాడా అసలు విషయం ఏంటో తెలుసుకునేందుకు అభిమానులు ఆరాటపడుతున్నారు. పర్సనల్ గా అసలు పాలిటిక్స్ మీద తనకు ఎలాంటి ఒపినియన్ లేని మహేష్ డైరెక్ట్ గా సిఎం పోస్ట్ కే ఎసరు పెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. శ్రీమంతుడు తర్వాత మహేష్ చేస్తున్న కొరటాల ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
సెప్టెంబర్ లో స్పైడర్ రిలీజ్ ప్లాన్ చేస్తుండగా కొరటాల శివ మహేష్ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మహేష్ కెరియర్ లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన శ్రీమంతుడు తర్వాత రాబోతున్న ఈ భరత్ అను నేను ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.