దాసరిని కుంగతీసింది అదే.. అందుకే అక్కడే అంత్యక్రియలు..?

Chakravarthi Kalyan
దాసరి నారాయణరావు వయస్సు 75 ఏళ్లు మాత్రమే.. ఆ వయసు వారెందరో ఇప్పటికీ హుషారుగా ఉన్నారు. పలువురు సెలబ్రెటీలు 75 దాటాక కూడా ఉత్సాహంగా పని చేస్తున్నారు. సినీరంగంలో లేకపోయినా కుటుంబాలతో సంతోషంగా గడుపుతున్నారు. మరి దాసరి ఎందుకు 75 ఏళ్లకే కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం ఎందుకు అంతగా పాడైంది. 


అందుకు కారణం ఆయన భార్య పద్మ మరణమే అని చెప్పాలి. దాసరి నారాయణ, పద్మ దంపతులది ఆదర్శ దాంపత్యం. ఈ విషయం సినీపరిశ్రమ అంతటికీ తెలుసు. కానీ  పద్మ 2011 చనిపోవడం దాసరికి జీవితంలోనే కోలుకోలేని దెబ్బ. భార్య మరణం ఆయన్ను కుంగతీసింది. సినీరంగంలో దాసరి ఎంత బిజీగా ఉన్నా ఆయన ఆరోగ్యాన్ని, ఇంటినీ కాపాడుకుంటూ వచ్చింది పద్మే.



ఆమె మరణం తర్వాత దాసరి ఆరోగ్యం క్రమంగా గాడి తప్పింది. వేసుకోవాల్సిన మందులు, జాగ్రత్తలను దాసరి పద్మ అంతగా పట్టించుకునే వారు కరవయ్యారు. మొన్న మే 4 న జరిగిన దాసరి పుట్టినరోజు వేడుకల్లోనూ దర్శకరత్న ఆమెను తలచుకున్నారు. ఆమె ఉంటే, తన పుట్టిన రోజును ఎలా పండగలా జరిపేదో అని గుర్తు చేసుకున్నారు.



అందుకే ఆయన అంత్యక్రియలను చేవెళ్ల సమీపంలో గల మొయినాబాద్ లోని దాసరి నారాయణరావు ఫాం హౌస్ లో నిర్వహిస్తున్నారు. ఆయన భార్య దాసరి పద్మ అంత్యక్రియలు కూడా అక్కడే నిర్వహించారు. అందుకే దాసరినీ అక్కడి నుంచే సాగనంపనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: