బాహుబలితో క్రిష్ లో కొత్త ఊహలు !

Seetha Sailaja
‘బహుబలి’ సీరీస్ ఘనవిజయం చాలామంది దర్శకుల ఆలోచనలను మార్చివేసి భారీ బడ్జెట్ తో చారిత్రాత్మక సినిమాలు తీసేలా ప్రభావితం చేస్తోంది. సంక్రాంతి కి విడుదలయిన క్రిష్ ‘గౌతమీపుత్రా శాతకర్ణి’ సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా బాలయ్య కెరీర్ లో కీలకమైన సినిమాగా మారిన విషయం తెలిసిందే. 

ఈ సినిమాను గ్రాండ్ సక్సస్ చేసి టాలీవుడ్ నే కాదు బాలీవుడ్ దృష్టిని సైతం ఆకర్షించారు క్రిష్. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తర్వాత మరే చిత్రాన్ని ప్రకటించకుండా అనేక ఆలోచనలు చేసి ‘బాహుబలి’ మూవీతో భారత చలనచిత్రపరిశ్రమ కలెక్షన్ రికార్డుల్ని తిరగరాసిన రచయిత విజయేంద్ర ప్రసాద్ అందించిన కథతో ‘మణికర్ణిక’ పేరుతో తాజా మూవీని ప్లాన్ చేశాడు క్రిష్. 

ఝూన్సీలక్ష్మిభాయ్ జీవిత కధను ఆధారంగా చేసుకుని హిందీలో నిర్మిస్తున్న ఈసినిమాలో ఝాన్సీలక్ష్మి గా కంగనా రనౌత్ నటిస్తోంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈసినిమాను తెలుగు తమిళ భాషలలో కూడ డబ్ చేయబోతున్నారు. 

ఈ సినిమాకు ప‌ని చేస్తున్న టీం స‌భ్యులంద‌రూ నిన్న వార‌ణాసి చేరుకుని ‘మ‌ణిక‌ర్ణిక’ లోగో లాంచ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. సాయంత్రం గంగా నది ఒడ్డున 20 అడుగుల ‘మ‌ణిక‌ర్ణిక’ లోగో పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించింది చిత్ర బృందం. లోగో పోస్ట‌ర్‌తో పాటు దాన్ని లాంచ్ చేసిన తీరు కూడా బాగుంద‌ని అప్పుడే క్రిష్‌ పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ’తో చారిత్ర‌క క‌థ‌ల్ని తెర‌కెక్కించే స‌త్తా తనుకుంద‌ని చాటుకున్న క్రిష్‌ ఈసారి మ‌రింత పెద్ద ప్ర‌య‌త్నాన్నే చేస్తున్నాడు అనుకోవాలి. క్రిష్‌కు ఈసారి విజ‌యేంద్ర ప్ర‌సాద్ లాంటి దిగ్గ‌జ ర‌చ‌యిత తోడ‌వుతుండ‌టంతో ఈ మూవి ప్రాజెక్ట్ కు ప్రారంభం నుండి క్రేజ్ పతాక స్థాయిలో ఉంది. 'మణికర్ణిక' ప్రాజెక్ట్‌ అనుకున్నప్పుడే భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించాలి అన్న ప్లాన్స్ క్రిష్ చేసినా ‘భాహుబలి 2’ ఘనవిజయం ప్రేరణతో ఈ మొవిఏ బడ్జెట్ ను కూడ చాలా భారీ స్థాయిలో పెంచినట్లు వార్తలు వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: