చాలా కష్టపడ్డాం.. బాహుబలికి లాస్ట్ వర్కింగ్ డే..!

Edari Rama Krishna
ఈ మద్య చాలా మంది దర్శకులు సినిమాలు అతి తక్కువ సమయంలో పూర్తి చేసి అభిమానుల ముందుకు తీసుకు వస్తున్నారు.  రాంగోపాల్ వర్మ, పూరి లాంటి దర్శకులైతే రెండూ, మూడు నెలల్లో సినిమా పూర్తి చేస్తూన్నారు.  హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమా ఎంత త్వరగా పూర్తి చేస్తే బడ్జెట్ విషయంలో అంత లాభపవవచ్చనే నేపథ్యంలో ఉన్న సమయంలో ఒక్క సినిమా కోసం ఏకంగా రెండు సంవత్సరాలు సుదీర్థంగా కష్టపడ్డారు దర్శకధీరుడు రాజమౌళి.  ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన తెలుగు చిత్రం ‘బాహుబలి’.  

అందుకే  ఈ చిత్రం అంచనాలు దాటి రికార్డు లేవెల్లో వసూళ్లు రాబట్టింది. జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు కైవసం చేసుకుంది.  తాజాగా బాహుబలి సీక్వెల్ బాహుబలి 2  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి-2' మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. నిన్న(ఏప్రిల్ 17)నే సినిమా సెన్సార్ పూర్తయినప్పటికీ... ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకుండా విషయం పెండింగులో పెట్టింది చిత్ర యూనిట్.

విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు 'యూ/ఎ' సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  బాహుబలి కోసం ఇవాళ చివరగా పని చేస్తున్నారట టీం. ‘లాస్ట్ వర్కింగ్ డే.. అనుకుంటున్నా. ఎంత గొప్ప ప్రయాణం.. మరెంత గొప్ప అనుభూతి.. ఇప్పుడు నాకు ఒక వైపు చిరునవ్వు.. మరోవైపు కొంత బాధతో కూడిన వణుకు.. రెండూ అనుభవిస్తున్నా’ అని చెప్పాడు రాజమౌళి.

ఐదేళ్ల పాటు సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత.. ఆ జర్నీ ఇవాల్టితో ముగిసిపోతుందని తెలిస్తే.. ఆ రోజున కచ్చితంగా ఇలాంటి అనుభూతి ఎవరికైనా కలుగుతుంది.  "What a journey.. What a experience", ఈ ట్రావెలింగ్‌లో ఎన్నో అనుభవాలు.. ఓవైపు ఆనందంగా నవ్వుకోవడం, ఇంకోవైపు బాధ అంటూ అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. గ్రాఫిక్స్, యుద్ధం సన్నివేశాలతో తెరకెక్కిన దీనికి యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. 2 గంటల 45 నిమిషాల నిడివి కలిగివుంది. ఇంకా తమిళం, మలయాళం, హిందీ వెర్షన్ సెన్సార్ పూర్తి కావాల్సిఉంది. కాగా, ప్రపంచవ్యాప్తంగా బాహుబలి-2 ఈనెల 28న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. 

రాజమౌళి ట్విట్టర్:

Last working day......hope fully..🙂
What a journey..what an experience..
I am both smiling with joy and wincing with pain..

— rajamouli ss (@ssrajamouli) April 18, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: