పవన్ అభిమానులను మురిపించి మురిపించి ఎట్టకేలకు నిన్న విడుదల అయిన పవన్కళ్యాణ్ 'కాటమరాయుడు' టీజర్ కు మిశ్రమ స్పందన వస్తోంది. అజిత్ హీరోగా వచ్చిన 'వీరమ్' చిత్రాన్ని 'కాటమరాయుడు' గా తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు అని వార్తలు వచ్చిన నేపధ్యంలో ఇప్పటిదాకా ఈమూవీ 'వీరమ్' సినిమా రీమేక్ కాదు అని ఈ సినిమా యూనిట్ వాదించిన విషయం తెలిసిందే.
అయితే నిన్న విడుదలైన ఈ టీజర్ ను చూసిన కొంతమంది ఈ టీజర్ ద్వారా ‘వీరమ్’ కు ఇది రీమేక్ అని పక్కాగా అంగీకరించినట్లు అయింది అని కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం ఈ టీజర్ ను చూసిన వారు అచ్చంగా 'వీరమ్' సినిమాని దించేసారు అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు డబ్బింగ్ రూపంలో ఆల్రెడీ వచ్చేసిన తమిళ సిమాని ఇప్పుడు రీమేక్ చేయడం ద్వారా ఏం కొత్తదనం చూపిస్తారు అంటూ మరికొందరు ఈ టీజర్ పై పెదవి విరుస్తున్నట్లుకామెంట్స్ వస్తున్నాయి.
అయితే పవన్ అభిమానులు మాత్రం ఈ టీజర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపిస్తూ హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ తో పవన్ అదరగొట్టేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా 'ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నది ముఖ్యం' అంటూ పవన్ చెప్పే ఒక్క డైలాగ్ ఈ టీజర్ రేంజ్ ని తారాస్థాయికి తీసుకు వెళ్ళింది అని కామెంట్స్ చేస్తున్నారు.
కత్తితో నరుకుతూ రెండు అర చేతులతో పవన్ ఆ కత్తిని పట్టుకునే సీన్ అదిరిపోయింది అని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇక పవన్ ఇంట్లో వేసే డ్యాన్సింగ్ సీక్వెన్స్ చూపించి పవన్ లోని హ్యూమర్ యాంగిల్ ని కూడా టచ్ చేశారు అని అభిమానులు మురిసిపోతు ఉన్నారు. అయితే పవన్ అభిమానుల హడావిడి ఇలా ఉంటె ఈ టీజర్ చూసిన మరికొందరు మాత్రం డబ్బింగ్ సినిమాల ఉంది అని కామెంట్స్ చేస్తున్న నేపధ్యంలో ‘కాటమరాయుడు’ టీజర్ ఊహించినంత అద్భుతంగా లేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి..