మోహన్ బాబు విలక్షణ వ్యక్తిత్యం గురించి ఎరుగని వారు ఉండరు. ఈ విలక్షణ నటుడికి కోపం వస్తే తన ముందు ఉన్న వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అని తెలిసినా ఏమాత్రం పట్టించుకోకుండా వారి పై సెటైర్లు వేస్తూనే ఉంటాడు. ఈ విషయంలో కొందరు బాధపడినా మోహన్ బాబు వ్యక్తిత్యాన్ని గ్రహించిన వాళ్ళు ఈవిషయాన్ని పట్టించుకోరు.
ఇప్పుడు లేటెస్ట్ గా ఇలాంటి సందర్భమే మరోసారి జరిగింది నిన్నరాత్రి జరిగిన మంచు విష్ణు ‘లక్కున్నోడు’ ఆడియో ఫంక్షన్ కు మోహన్ బాబు అతిథిగా వచ్చారు. తన బిడ్డ విష్ణు చాలా సిన్సియర్ అని అందరూ ప్రశంసిస్తుంటే తనకు ఆనందంగా ఉంది అంటూ ఒక విషయంలో కొడుకు తనకు కలిగిన నిరుత్సాహాన్ని స్టేజ్ మీదే చెప్పడమే కాకుండా ఏకంగా విష్ణుకి వార్నింగ్ ఇచ్చి మరో షాక్ ఇచ్చాడు మోహన్ బాబు.
"విష్ణు.. ఐ వాంట్ టు గివ్ యు వార్నింగ్ ఫర్ యు.. ఇట్స్ ఏ వార్నింగ్.. పబ్లిక్ చూస్తున్నారు. భార్య.. ఇద్దరు బిడ్డలు ఉన్నవాడివి.. ఈ మధ్యనే టీవీల్లో చూశాను. పదిమంది ఎదుట ఉన్నపుడు పదిమందిలో నువ్వు చేసిన తప్పు చెప్పాలి. నేను సహజంగానా ఆడియోకి కూడా వెళ్లను అని ఎక్కడో ఫంక్షన్ లో అన్నావు అది తప్పు. నీ ఆడియో ఫంక్షన్ కి నువ్వు వెళ్లాలి. పదిమంది హీరోలు నిన్ను ప్రేమగా పిలిచినపుడు వారి ఆడియో ఫంక్షన్ కి వెళ్లాలి. అంతేకానీ నా ఆడియో ఫంక్షన్ కూడా నేను వెళ్లను అని కొంతమంది హీరోల్లాగా డబ్బాలు కొట్టుకోవద్దు. అర్ధమైందా.. బీ సిన్సియర్.. సిన్సియర్ గా ఉన్నపుడే అన్నీ ఉంటాయ్ మనకి.. డబ్బాలు వద్దు మనకు" అంటూ కొడుకు విష్ణుకు సున్నితంగా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు మోహన్ బాబు.
మోహన్ బాబు నోటివెంట ఈ వార్నింగ్ విన్న విష్ణు కొద్ది క్షణాలపాటు షాక్ అయినా ఆ తరువాత మోహన్ బాబు మాటలకు చిరునవ్వులు నవ్వాడు. ఎంతో ఆహ్లాదకరంగా జరిగిన ఈ ఆడియో ఫంక్షన్ కు హీరోయిన్ హాన్సిక డుమ్మా కొట్టడం చాలామందిని ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం లక్ తక్కువగా ఉన్న విష్ణుకు ఈ ‘లక్కున్నోడు’ ఎలాంటి కిక్ ఇస్తుందో చూడాలి..