సెప్టెంబర్ లో సినిమా జాతర

HANUMA HANUMA
వారం గ్యాప్ లతో వరుసగా పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. ఇప్పుడు ఊ కొడతారా ఉలిక్కిపడతారా రానుంది. ఆ తర్వాత ‘దేవుడు చేసిన మనుషులు’, ఆగస్టు 9న ‘జులాయి’ అని వరుసగా సినిమాలు విడుదల కానున్నాయి. అందుకే చిన్న సినిమాలకు, డబ్బింగ్ చిత్రాలకు థియేటర్లు దొరకడం లేదు. దాదాపు 20 చిన్న సినిమాలు థియేటర్లు దొరక్క ఎప్పుడెప్పుడు విడుదలవుదామా? అన్నట్టున్నాయి. పెద్ద సినిమాల మధ్య విడుదలై చితికిపోవడం ఇష్టం లేని చిన్న నిర్మాతలు ఆగస్టు నెలాఖరునగానీ, సెప్టెంబర్ లో గానీ తమ సినిమాలను విడుదల చేసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు.  అంటే సెప్టెంబర్ లో సినిమాల జాతరే అని అర్థం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: