అ..ఆ..రెండు వారాల కలెక్షన్లు

Edari Rama Krishna

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, లవర్ బాయ్ నితిన్ కాంబినేషన్ లో  జూన్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘అ..ఆ’ సినిమాకి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్లతో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన మార్క్ స్టైల్‌తో తెరకెక్కించిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో.. ఇది మంచి వసూళ్ళు రాబడుతోందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.చాలా రోజుల తర్వాత మంచి ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్ చూసిన అనుభూతి ప్రేక్షకుల్లో కలిగినందుకే ఈ విజయం అని చిత్ర యూనిట్ అంటున్నారు.


రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రెండు వారాల్లో రూ. 28.88 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల లెక్కల స్పష్టం చేశాయి. నితిన్, సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి ఇప్పటికీ మంచి ఆదరణ లభిస్తుండడంతో ఈ శుక్రవారం మరిన్ని కలెక్షన్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.  నితిన్సమంతల కెమిస్ట్రీ ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్ కావడంతో ఈ మూవీ ఇలా మంచి కలెక్షన్లు వసూలు చేస్తోందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. ఈ చిత్రం కోసం తర్వాత చేసిన ప్రమోషన్ వర్క్ కూడా బాగా వర్క్ ఔట్ అయ్యింది. 


ఏరియాల వారీగా ‘అ..ఆ’ రెండు వారాల కలెక్షన్స్ (కోట్లలో) :


నైజాం : 12.37

సీడెడ్ : 3.87

వైజాగ్ : 3.51

గుంటూరు : 2.31

ఈస్ట్ గోదావరి : 2.08

కృష్ణా : 2.05

వెస్ట్ గోదావరి : 1.83

నెల్లూరు : 0.86

టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 28.88 కోట్లు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: