తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వారసుల హవా కొనసాగుతున్న సమయంలో మొట్ట మొదటి సారిగా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక. మొదటి నుంచి సినీ వాతావరణంలో పెరిగిన నిహారిక చిన్నప్పటి నుంచి సినిమాలపై మోజు పెంచుకొని మొదట షార్ట్ ఫిల్మ్ లో చేసి తర్వాత బుల్లితెరపై యాంకర్ గా చేస్తు తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది. క్యూట్ స్మైల్ తో చలాకీగా మాట్లాడుతూ యాంకర్ గా మంచి సక్సెస్ సాధించింది. ఇక రామరాజు దర్శకత్వంలో ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నవిషయం తెలిసిందే.
ఒక మనసు ఆడియో రిలీజ్
మధుర శ్రీధర్, రవి ప్రకాశ్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్ర ఆడియో వేడుక బుధవారం సాయంత్రం శిల్పకళావేదికలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు మెగా హీరోలు రామ్‌చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నిహారిక సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. అంతే కాదు ఇటీవల ఒక మనసు చిత్రానికి సంబంధించి స్మాల్ టీజర్‌ని విడుదల చేసిన చిత్ర యూనిట్, నిన్న జరిగిన ఆడియో ఫంక్షన్లో థీయేట్రికల్ ట్రైలర్‌ని రిలీజ్ చేసి మూవీపై మంచి ఎక్స్పెక్టేషన్ పెంచారు. నిహారక సరసన నాగశౌర్య హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సంధ్య అనే డాక్టర్ పాత్రను నిహారిక పోషించగా, సూర్య అనే ఒక యువకుడిగా నాగశౌర్య కనిపించనున్నాడు.
ఒక మనసు పోస్టర్
ఫీల్‌గుడ్ మూవీలా రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రంలో నిహారిక, నాగశౌర్యల మద్య ముద్దు సీన్లపై కామెంట్లు వస్తున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి అంటే గ్లామర్ , ముద్దు సీన్లలో ఎక్కువ గా నటించదని ఒక నమ్మకం పెట్టుకున్న మెగా ఫ్యాన్స్ ఈ ట్రైలర్ చూశాక ముద్దు సీన్లు బాగానే ఉన్నట్టు ఫిక్స్ అయ్యారు. వాస్తవానికి ఈ సినిమాలో సందర్బాన్ని బట్టే అలాంటి సన్నివేశాలు ఉంటాయి తప్ప వేరే భావంతో కాదని చిత్ర యూనిట్ తెలిపారు.
ఒక మనసు పాటల వేడుక చాలా సరదాగా జరగగా సునీల్ కశ్యప్ సంగీతం మ్యూజిక్ ప్రియులను ఎంతగానో అలరించింది. ఈ సినిమాకు సంబంధించి థీయేట్రికల్ ట్రైలర్లో లవ్ కి సంబంధించి కాస్త సీన్లు ఘాటుగానే ఉన్నాయి. అంతే కాదు నాగశౌర్య,నిహారక కెమిస్ట్రీ కూడా బాగా ఉన్నట్టు టాక్ వచ్చింది. ‘ఒక మనసు’ థీయేట్రికల్ ట్రైలర్ మీకోసం.