బాలీవుడ్ మీడియా దాడిలో రాజమౌళి !

Seetha Sailaja
రాజమౌళి ‘బాహుబలి’ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించి తెలుగు దర్శకుడు సత్తాను చాటిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు అదే రాజమౌళిని కామెంట్ చేస్తూ బాలీవుడ్ మీడియా కామెంట్స్ వ్రాయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. దీనికి కారణం గతవారం బాలీవుడ్ లో విడుదలైన ‘బాజీరావు మస్తానీ’ ఈ సినిమా కథ ‘బాహుబలి’ కథ వేరు అయినప్పటికీ సాంకేతిక పరంగా ‘బాజీరావు మస్తానీ’ సినిమా ‘బాహుబలి’ తో పోలుస్తూ బాలీవుడ్ మీడియా వ్రాస్తున్న కామెంట్స్ అత్యంత ఆ శక్తి దాయకంగా ఉన్నాయి. 

ఈ రెండు సినిమాల మేకింగ్ విధానాలను పోలుస్తూ ‘బాహుబలి’ని మించిన సినిమాగా ‘బాజీరావు మస్తానీ’ ని పోలుస్తూ బాలీవుడ్ మీడియా కామెంట్స్ వ్రాస్తోంది. సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ఎంతో గ్రాండ్ గా ఉంది అని ప్రశంసిస్తూ ఈసినిమాలో వచ్చే తొలి ఫైట్ సన్నివేశం ‘బాహుబలి’ పోరాటాల కంటే కూడా బాగా చిత్రీకరించారు అని బాలీవుడ్ మీడియా కామెంట్స్ వ్రాస్తోంది. 

అంతేకాదు ‘బాహుబలి’ లో గ్రాఫిక్స్ హడావిడి తప్పించి నటన పరంగా ‘బాజీరావు మస్తానీ’ లో రన్వీర్ సింగ్, దీపికా పదుకునే,  ప్రియాంక చోప్రాల అభినయంతో  పోలిస్తే ‘బాహుబలి’ లోని నటీనటుల నటన తేలిపోయింది అని బాలీవుడ్ మీడియా కామెంట్స్ రాస్తోంది. ఈసినిమాకు సూపర్ హిట్ టాక్ రావడమే కాకుండా ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడ మన ఇరు రాష్ట్రాలలోని ముఖ్య పట్టణాలలో మంచి కలెక్షన్స్ వసూలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. 

బాలీవుడ్ టాప్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన ‘దిల్ వాలే’ సినిమాతో పోటీగా విడుదలైన ‘బాజీరావు మస్తానీ’ కేవలం 3 రోజులలో ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల కలెక్షన్స్ ను వసూలు చేయడమే కాకుండా షారూఖ్ ఖాన్ ద్వారా బాలీవుడ్ కు పరిచయం కాబడ్డ దీపిక పదుకొనె ఏకంగా బాలీవుడ్ బాదుషాకు షాక్ ఇవ్వడం బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి వరకు రాజమౌళిని పొగిడిన బాలీవుడ్ మీడియా ఇప్పుడు ఇలా రూట్ మార్చి ‘బాహుబలి’ పై సెటైర్లు వేయడం హాట్ టాపిక్..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: