వారాహి చలన చిత్ర బ్యానర్లో సినిమాలు చేస్తున్న సాయి కొర్రపాటి నిర్మాతగా తన అభిరుచిని తన సినిమాల ద్వారా తెలియ చేస్తున్నాడు. అయితే బుల్లితెర ఓంకార్ తెరకెక్కించిన రాజు గారి గది సినిమాకు సాయి కొర్రపాటి సహాయం అందించడం అందరిని షాక్ కి గురి చేసింది. కామెడీ థ్రిల్లర్ గా రాబోతున్న రాజు గారి గది ఓంకార్ దర్శకత్వంలో వస్తుంది. రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాతాల్లో సాయి కొర్రపాటి కొని రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఓంకర్ సాయిని మాయ ఏమన్నా చేశాడా అన్నది ఎవరికి అర్ధం కావట్లేదు.
అయితే సాయి కొర్రపాటి చెబుతున్నది ఏంటంటే సినిమా చాలా బాగా వచ్చిందని అందుకే దాన్ని ప్రమోట్ చేయాలని చేస్తున్నానని అంటున్నాడు. సాయి బ్యానర్లో సినిమా రిలీజ్ అంటే ఇప్పటిదాకా చిన్న సినిమా అయిన రాజు గారి గది ఒక్కసారిగా స్టార్ సినిమాగా మారిపోయింది. సినిమాకు శాటిలైట్ కూడా మాంచి రేటు పలికిందని టాక్. ఇకపోతే ఓంకార్ మాత్రం ఈ సినిమాకు చాలా కష్టపడాడనేది ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. మొదటి సినిమా జినియస్ తో పోయిన పరువును ఈ సినిమాతో ఎలాగైనా తెచ్చుకోవాలని తెగ తాపత్రయ పడుతున్నాడు.
అయితే సాయి కొర్రపాటి ని ఇంప్రెస్ చేసేలా సినిమా ఉందంటే సినిమా కచ్చితంగా ప్రజాధరణ పొందుతుందని నమ్ముతున్నారు. రేపు రిలీజ్ అవ్వనున్న కంచె, కొలంబస్ లకు పోటీగా రాజు గారి గది రంగంలో దిగుతుంది. బ్రూస్ లీ యావరేజ్ గా మిగిలింది కాబట్టి రుద్రమదేవి కలెక్షన్స్ పుంజుకున్నా మిగతా సినిమాలకు కూడా మంచి మార్కెట్ జరిగే అవకాశం ఉంది.
మరి ఓంకార్ మీద సాయి పెట్టుకున్న నమ్మకం ఎంతవరకు నిలబెట్టుతాడో చూడాలి. సినిమాను ఓ చిన్నపాటి స్టార్ హీరో సినిమా లానే భారీ రేంజ్లో రిలీజ్ చేస్తున్నాడు సాయి కొర్రపాటి.