INCOME TAX: ఈ ఆదాయం లేకుంటేనే 12.75 ట్యాక్స్ ఫ్రీ..లేకపోతే గేమ్ ఓవర్..!

frame INCOME TAX: ఈ ఆదాయం లేకుంటేనే 12.75 ట్యాక్స్ ఫ్రీ..లేకపోతే గేమ్ ఓవర్..!

Thota Jaya Madhuri
కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పన్నుల విషయంలో మార్పులు చేస్తూనే ఉంది. ఈ ఏడాది మధ్యతరగతి వారికి భారీ ఊరటనిస్తూ, ₹12 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో స్పష్టంగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక దీనికి స్టాండర్డ్ డిడక్షన్ ₹75,000ను కలుపుకుంటే, మొత్తంగా ₹12 లక్షల 75 వేల వరకు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని తాజాగా పేర్కొంది. అయితే ఇది అందరికీ వర్తించదు. దానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి.



దేశవ్యాప్తంగా వేతనదారులు మరియు స్వయం ఉపాధి వర్గాల వారికి ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను భారం తగ్గించే విధంగా శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం, దానికి కొన్ని షరతులు కూడా పెట్టింది. తాజాగా ప్రకటించిన సవరణల ప్రకారం, కొత్త పన్ను విధానంలో ఇప్పుడు వార్షిక ఆదాయం ₹12.75 లక్షల వరకు ఉన్నవారు ఒక్క రూపాయి కూడా ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే, ₹12.75 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పన్ను సున్నా అవుతుంది. ఈ మొత్తానికి సెక్షన్ 87A కింద రిబేట్ లభిస్తుంది.

రిబేట్ ట్యాక్స్ అంటే ఏమిటి?

రిబేట్ అంటే పన్ను నుంచి మినహాయింపు లేదా రీఫండ్ . భారతదేశంలో వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారులకి Income Tax Act – Section 87A  ప్రకారం రిబేట్ ఇవ్వబడుతుంది.

రిబేట్ ఎలా సాధ్యం అవుతోంది?

ఇంతకు ముందు కొత్త పన్ను విధానంలో దాదాపు ₹7 లక్షల వరకు ఆదాయానికి మాత్రమే రిబేట్ (సెక్షన్ 87A) అందుబాటులో ఉండేది. కానీ ఇటీవల చేసిన మార్పుల వల్ల 2024-25 బడ్జెట్‌లో స్లాబ్‌లు, డిడక్షన్‌లు సవరించబడ్డాయి. దీని కారణంగా స్టాండర్డ్ డిడక్షన్ ₹50,000, ప్రావిడెంట్ ఫండ్ మరియు ఇతర మినహాయింపులు, అలాగే రిబేట్ కలిపి పన్ను చెల్లించకుండా ఉండే పరిమితి నేరుగా ₹12.75 లక్షలకు చేరింది.

దీని వల్ల ఎవరికి లాభం?
సాలరీడ్ ఉద్యోగులు, ప్రభుత్వ & ప్రైవేట్ పెన్షనర్లు, చిన్న వ్యాపారులకు ఇది కొంత మేర ప్రయోజనం కలిగిస్తుంది. ఇది కేవలం కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నవారికే వర్తిస్తుంది. పాత విధానాన్ని ఎంచుకుంటే, పన్ను మినహాయింపు పరిమితి ఇంకా ₹5 లక్షల వరకే ఉంటుంది. కొత్త సవరణలతో మధ్యతరగతి వర్గానికి భారీగా ఊరట లభించింది.  ఇప్పుడు తెలివిగా మినహాయింపులు ప్లాన్ చేసుకుంటే ₹12.75 లక్షల వరకు కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.

ఈ రిబేట్ ఎవరికి వర్తించదు?

కొత్త సవరణల ప్రకారం, ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ₹12 లక్షల వరకు ఉంటే, దానికి ₹60,000 రిబేట్ వర్తిస్తుంది. అయితే, సెక్షన్ 111ఆ కింద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, అలాగే సెక్షన్ 112 కింద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆదాయాలపై సెక్షన్ 87ఆ రిబేట్ వర్తించదు. అంటే, మీ ఆదాయం ₹12.75 లక్షల లోపు ఉన్నప్పటికీ, స్వల్పకాలిక మూలధన లాభాలపై నిర్దిష్టమైన పన్ను రేటును చెల్లించాల్సి ఉంటుంది.

పాత పన్ను విధానంలో అయితే, 2024-25 ఆర్థిక సంవత్సరంలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా రిబేట్ వర్తిస్తుంది. అంటే, మీకు ₹5 లక్షల వరకు ఆదాయంపై, స్వల్పకాలిక మూలధన లాభాలు కలిపి మొత్తంగా ₹12,500 రిబేట్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: