ఏంటీ.. పాత మొబైల్స్ నుండి.. బంగారం వెలికి తీయొచ్చా?
అయితే పాడై పోయిన మొబైల్స్ ద్వారా ఎలాంటి ఉపయోగం ఉంది అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. కానీ అప్పుడప్పుడు మాత్రం పాత మొబైల్ ద్వారా ఎంతో విలువైన బంగారాన్ని వెలికి తీయొచ్చు అని ఒక టాక్ మాత్రం చాలామంది నోట వినిపిస్తూ ఉంటుంది.. అయితే కొంత మంది ఇదంతా కేవలం పుకారు మాత్రమే అని కొట్టి పారేస్తూ ఉంటారు. ఇంకొంద మంది మాత్రం ఇక ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని మరింత సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే.
సాధారణంగా పాత మొబైల్ ఫోన్ నుంచి బంగారం వెలికి తీయొచ్చు అని చాలాకాలం నుంచి ఒక మాట వినిపిస్తుంది అయితే ఎంత మేరకు బంగారం లభిస్తుంది అనే విషయంపై మాత్రం కొంతమంది ఇటీవల పరిశోధనలు జరిపారు. అయితే 41 ఫోన్ల రీసైక్లింగ్ నుంచి ఒక గ్రామ గోల్డ్ పొందవచ్చు అని తెలిపారు. ఇక ఒక టన్ను ఫోన్ లో నుంచి 300 గ్రాములు బంగారం వెలిక్కి తీయవచ్చు అని యుమీ కోర్ అనే సంస్థ తెలిపింది. కాగా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అని చెప్పాలి. పాడైపోయిన మొబైల్స్ రీసైక్లింగ్ ద్వారా ఎలాంటి లాభం ఉండకపోవచ్చు అని మరి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.