అదృష్టం అంటే ఇతనిదే.. ఒక్క రాత్రిలో 20 కోట్లు గెలుచుకున్నాడు?

praveen
లక్ష్మీదేవి కటాక్షం ఉండాలే కానీ ఏదో ఒక విధంగా అదృష్టం వరిస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే నేటి రోజుల్లో జనాలు ఇదంతా ట్రాష్ అని కొట్టి పారేసిన వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూస్తూ ఉంటే మాత్రం ఇది నిజమే అని నమ్మకుండా ఉండలేకపోతు ఉంటారు. ఎందుకంటే కడు పేదరికంలో బ్రతుకుతున్న వారిని సైతం రాత్రిరాత్రే కోటీశ్వరులుగా మారిపోతూ ఉంటారు. ఇలా జరగాలి అంటే కేవలం కొన్ని మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఏకంగా స్టార్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం లేదంటే లాటరీ టికెట్ కొనుగోలు చేయడం. అయితే స్టాక్ మార్కెట్లో అనుభవం లేకుండా ఇన్వెస్ట్మెంట్ పెడితే ఉన్నది కూడా పోయే పరిస్థితి ఉంటుంది.

 అదే లాటరీ టికెట్ అయితే.. అదృష్టం కలిసి వచ్చింది అంటే చాలు ఓవర్ నైట్ లో కోటీశ్వరుడు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఎంతోమంది విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నారు లాటరీ టికెట్ కొనుగోలు చేసి ఏకంగా కోటీశ్వరులుగా మారుతున్న ఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఇలా లాటరీ టికెట్ కు సంబంధించిన వార్త ఏదైనా తెరమీదకి వచ్చిందంటే సాలు అది వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇటీవలే పుదుచ్చేరికి చెందిన ఓ వ్యక్తికి ఇలాగే ఒక బంపర్ లాటరీ తగిలింది. ఒక్క రాత్రిలోనే కోటీశ్వరుడు గా మారిపోయాడు. అది కూడా ఏకంగా 20 కోట్లు గెలుచుకున్నాడు.

 పుదుచ్చేరికి చెందిన 30 ఏళ్ల వ్యక్తి ఇలా ఏకంగా 20 కోట్ల రూపాయల విలువైన లాటరీని గెలుచుకున్నాడు. శబరిమల యాత్రలో భాగంగా తిరువనంతపురంలో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు సదరు వ్యక్తి. తన అదృష్టాన్ని పరీక్షించుకోగా ఇక లక్ష్మీ దేవత కటాక్షం కూడా లభించింది. అయితే కేరళలోని రెండవ అతిపెద్ద లాటరీ బహుమతిని గెలుచుకున్నాడు. దాదాపు 45 లక్షల మంది 400 రూపాయల లాటరీ టికెట్ను కొనుగోలు చేయగా ఇక అతను కొనుగోలు చేసిన టికెట్ నెంబర్ కు 20 కోట్ల రూపాయల లాటరీ పలికింది. ఇక కటింగ్స్ అన్ని పోను అతనికి 12 కోట్ల రూపాయలు అందనున్నాయ్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: