మనీ: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డిఏ పెంపు..!!

Divya
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు న్యూ ఇయర్ సందర్భంగా ఒక అదిరిపోయే గిఫ్ట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతోంది..DA పెంపుకు సంబంధించి అధికారికంగా ప్రకటన మార్చిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదట. జనవరి నెల నుంచి ఇది వర్తిస్తుందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సైతం జీతాలు కూడా భారీగా పెరగబోతున్నాయని కేంద్రం 4 శాతం పెంచే వచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 46 శాతం డియ్యను కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సైతం అందిస్తున్నదట గత ఏడాది 38% ఉండగా రెండుసార్లు చొప్పున నాలుగు శాతం వరకు పెంచడంతో ఇప్పుడు 46 శాతానికి చేరుకుంది.ఇప్పుడు మరొకసారి నాలుగు శాతం..DA 50 శాతం వరకు పెరుగుతుంది.
చివరిగా గత ఏడాది అక్టోబర్ నెలలో ఈ DA ను పెంచింది కేంద్ర ప్రభుత్వం.. దీపావళి గిఫ్ట్ కింద నాలుగు శాతం అందించింది.. ఇక వీటితోపాటు పెన్షనర్లకు డియర్ నెస్ రిలీఫ్ (డిఆర్) కూడా పెరుగుతుందట. పెన్షనర్లకు బేసిక్ పే లో నుంచి డియర్ నెస్ రిలీఫ్ అందజేస్తుందట. ఏడాదికి రెండు సార్లు చొప్పున డిఏ పెంపు ఉంటుందని జనవరి ఒకటి లేదా జులై 1 లలో ఉండబోతుందని తెలుపుతున్నారు..

ప్రస్తుతం పెరుగుతున్న ధరల ప్రభావం వల్ల..AICPI ఇండెక్స్ 139.1 శాతం వరకు చేరిందట.. ఈ ఏడాది మార్చి నెలలో ఈ డిఏ పెంపు ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం అలాగే 67 లక్షల మంది పెన్షనర్లకు సైతం ఈ లబ్ధి చేరబోతోంది.. దీంతో కేంద్ర ప్రభుత్వం పైన ప్రతి ఏటా కూడా 12,857 కోట్ల రూపాయల భారం పడుతుందట.. మరొకవైపు కొత్త పే కమిషన్ ని సైతం అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సైతం డిమాండ్ చేస్తున్నారు.. దీంతో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: