మనీ :చౌక ధరకే బిఎస్ఎన్ఎల్ నుంచి ఏడాది ప్లాన్స్..!!

Divya
టెలికాం దిగ్గజ సంస్థలలో విపరీతమైన పోటీ తత్వం నెలకొంది. దీంతో ఎయిర్టెల్, జియో ఇతరత్రా సంస్థలు తమ ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉన్నాయి.. వీటితో పాటు చౌకైన ధరలకే పలు రకాల స్పీడ్ డేటా తో పాటు కాల్స్ మాట్లాడుకుని సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఈ పోటీలో బిఎస్ఎన్ఎల్ కాస్త వెనుకబడిందని చెప్పవచ్చు. దీని వినియోగదారులు బాగానే ఉన్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే రీఛార్జ్ చేసుకునేటప్పుడు 30 రోజులు ,మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది ఇతరత్రా ప్లాన్స్ ని సైతం గమనిస్తూ ఉంటారు..
చాలామంది ఎక్కువగా మూడు నెలల ప్లాన్లు వినియోగించుకుంటూ ఉంటారు. అయితే చవకైన ధరకే ఏడాది ప్లాన్ ను బిఎస్ఎన్ఎల్ అందిస్తోంది. వాటి గురించి చూద్దాం.
Bsnl:1999 ప్లాన్:
బిఎస్ఎన్ఎల్ నుంచి ఏడాది వ్యాలిడిటీతో ఈ ప్లాన్ వస్తుంది ఇది 365 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది.600 gb డేటాతో లభిస్తుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు ప్రతిరోజు 100 SMS ఉచితంగా పంపించుకోవచ్చు. ఇంటర్నెట్ వేగం 40 kbpsp స్పీడ్ తో వస్తుందట.
Bsnl:2,399 plan:
బిఎస్ఎన్ఎల్ నుంచి ప్రీపెయిడ్ ప్లాన్లలో అపరిమిత కాలింగ్ లభిస్తాయి.. అలాగే రోజు 100 SMS..2GB డేటాతో లభిస్తుంది.. మన దేశంలో ఉన్న అత్యంత సరసమైన బెస్ట్ ప్లాన్స్ లో ఇది కూడా ఒకటి.
Bsnl 2,999 plan:
బిఎస్ఎన్ఎల్ నుంచి అందుబాటులో ఉన్న మరొక ప్లాన్ ఇది.. 395 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది.. అపరిమిత కాలింగ్ తో పాటు ప్రతిరోజు కూడా 3GB డేటా తో పాటు 100 sms లు పొందవచ్చు.
ఈ మూడు బిఎస్ఎన్ఎల్ ప్లాన్స్ ఏడాది వ్యాలిడిటీతో లభిస్తాయి.. అయితే మరొక ప్లాన్ ఉంది కానీ అది 336 రోజులకే వ్యాలిడిటీతో ఉంటుంది. దీని ధర 1499 రూపాయలకు ఉంది. అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు రోజుకి 100 sms ఫ్రీ అలాగే 24GB డేటా మాత్రమే కలిగి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: