మనీ: గూగుల్ పే..ఫోన్ పే యూజర్స్ అలర్ట్..Upi రూల్స్ చేంజ్..!!

Divya
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ సైతం ఎక్కువగా యూపీఐ లావాదేవీల పైన ఆధారపడుతున్నారు. ముఖ్యంగా కిరాణా కొట్టు నుంచి షాపింగ్ మాల్ వరకు ప్రతి ఒక్కరు కూడా లావాదేవులను యూపీఐ ద్వారానే చెల్లిస్తూ ఉన్నారు. అయితే యూపీఐ లావాదేవులకు సంబంధించి ఈరోజు నుంచి సరికొత్త నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి..UPI ద్వారా ఆటోమేటిక్ చెల్లింపు పరిమితిని సైతం లక్ష రూపాయలకు పెంచుతున్నట్లు RBI గతంలో ఒక కీలకమైన విషయాన్ని తెలియజేసింది.. బీమా ప్రీమియం చెల్లింపులతోపాటు క్రెడిట్ కార్డ్ బిల్లులను కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయట.

గతంలో విద్యాసంస్థలు ఆసుపత్రులకు ఒకసారి లక్ష రూపాయల వరకు చెల్లించే అవకాశం ఉండగా.. ఇప్పుడు వాటిని 5 లక్షల రూపాయల వరకు పెంచినట్లు తెలుస్తోంది.. యూపీఐ ఐడీలు నెంబర్లు ఒక ఏడాది పాటు వినియోగంలో లేకపోతే ఆ నెంబర్లను సైతం డి యాక్టివేషన్ చేయబోతున్నట్లు తెలియజేసింది.. ఇక మీదట రూ.2000 రూపాయల కంటే ఎక్కువగా మర్చంట్ పేమెంట్ చేస్తే ఆ లావాదేవీల పైన 1.1 శాతం వరకు ఇంటర్ చేంజ్ చార్జీలు సైతం వర్తిస్తాయంటూ తెలియజేస్తున్నారు.

ఒక బ్యాంకు ఖాతా నుండి మరొక బ్యాంకు ఖాతాకు లావాదేవులు చేస్తే మాత్రం ఎలాంటి చార్జీలు ఉండవంటూ తెలియజేస్తోంది యూపీఐ సంస్థ.. త్వరలోనే దేశవ్యాప్తంగా యూపీఐ ఏటీఎంలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు.. అలాగే యూపీఐ టాక్స్ అండ్ పే విధానాన్ని కూడా త్వరలోనే అమలు చేయబోతున్నారట. యూపీఐ ఫోన్లో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అనే ఫీచర్స్ అమలు చేయబోతున్నారు.. దీనివల్ల ఎవరైనా కొత్త వ్యక్తులకు సైతం మొదట డబ్బులు పంపించాలి అంటే రూ .2000 రూపాయలు దాటితే లావాదేవీలు పూర్తి కావడానికి సైతం దాదాపుగా 4 గంటల సమయం వరకు ఆగాల్సి ఉంటుంది.. దీనివల్ల ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మన నుంచి డబ్బులు కొట్టేయాలి అంటే ఇకమీదట ఆ ఆటలు సాగవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: