మనీ: ఈరోజు వారి అకౌంట్లో 20000.. ఏపీ సీఎం జమ..!!

Divya
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజున జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేయబోతున్నారు. ఈ డబ్బును ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విద్యార్థుల తల్లుల జాయింట్ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా విడుదల చేయబోతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి.. దీంతో ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఆనందంలో ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్ల సీఎం ఈ డబ్బులను విడుదల చేసిన తర్వాత లబ్ధిదారులు తమ అకౌంట్లో డబ్బు జమ అయిందా లేదా అనే విషయాన్ని చూసుకోవాలి.


జగనన్న విద్యా దీవెన కింద ఇవాళ 584 కోట్లతో కలిపి ఇప్పటివరకు విద్యా దీవెన డబ్బులు విడుదల చేశారు అలాగే దీవెన పథకం కింద వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18,576 కోట్ల రూపాయలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.. టిడిపి ప్రభుత్వంలో కేవలం 6000 కోట్ల రూపాయలే ఇచ్చినట్లుగా తెలుస్తోంది.. పేద విద్యార్థులకు చదువులకు చదవాలన్న ఉద్దేశంతోనే ఇంజనీరింగ్, మెడిసిన్, పాలిటెక్నికల్, డిగ్రీ ,ITI తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులకు సైతం వారి యొక్క కాలేజీ ఫీజులను చెల్లించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటోంది.


ఇందుకోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి మనీని వారి అకౌంట్లో జమ చేస్తున్నారు.. ఈ డబ్బులను డైరెక్ట్ గా తల్లుల అకౌంట్లో జమ చేయబోతున్నారు. ఆ తర్వాతే కాలేజీ యాజమాన్యులు వారి నుంచి తీసుకొనే విధంగా చేయడం జరిగింది. పేద విద్యార్థుల భోజన హాస్టల్ వాటికోసం రెండు వాయిదాలలో ఐటిఐ విద్యార్థులకు 10,000 చొప్పున పాలిటెక్నికల్ విద్యార్థులకు 15000 చొప్పున ఇంజనీరింగ్ డిగ్రీ మెడిసిన్ వంటి కోర్సు విద్యార్థులకు 20,000 చొప్పున ఇస్తోంది. అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్ల కాలంలో విద్యారంగం పైన వైసిపి ప్రభుత్వం..73,417 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా తెలుస్తున్నది ఈ పథకాల ప్రయోజనం పొందుతున్న విద్యార్థులు భవిష్యత్తులో కూడా వీరు ఉన్నత స్థాయిలో ఉండాలని ప్రభుత్వం ఆశిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: