మనీ: ఈ మొక్కలతో రైతులకు కాసుల వర్షం..!!

frame మనీ: ఈ మొక్కలతో రైతులకు కాసుల వర్షం..!!

Divya
ఉద్యోగం చేస్తున్న వారు చాలామంది డబ్బులు సరిపోలేక ఇతర బిజినెస్ లు చేయడానికి కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.. ముఖ్యంగా కొత్త పద్ధతులలో పంటలను సైతం పండిస్తూ అధిక లాభాలను సైతం పొందడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎటువంటి రిస్క్ లేకుండా ఉండేటువంటి బిజినెస్ చాలా మంది ఎంచుకొని వ్యాపార రంగంలో అడుగుపెట్టి లక్షలలో లాభాలను పొందుతున్నారు. అలా చందనం కి కూడా భారీ డిమాండ్ ఉన్నది. చందనంతో లక్షలలో ఆదాయాన్ని సైతం మనం సంపాదించుకోవచ్చు. వీటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.



ఈ చందనం వల్ల బ్యూటీ ప్రాడెక్టులను తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు  అంతేకాకుండా ఆయుర్వేదంలో కూడా వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఇలాంటివి మన దేశంలో ఎక్కువగా గుజరాత్ రాజస్థాన్ వంటి ప్రాంతాలలో మాత్రమే ఎక్కువగా పండిస్తూ ఉన్నారట. కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే ఈ చందనం మొక్కల ద్వారా కొన్ని కోట్ల రూపాయలను సైతం ఆదాయాన్ని పొందవచ్చు. కానీ చందనం మొక్కలు పెంచడానికి అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకోవలసి ఉంటుంది. మనం వాడేటువంటి పెర్ఫ్యూమ్ లలో కూడా ఎక్కువగా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే పలు రకాల సబు లలో తయారీలో కూడా వీటిని వినియోగిస్తూ ఉంటారట.

అందుకే వీటికి మార్కెట్లో ఎప్పుడూ కూడా డిమాండ్ తగ్గదని చెప్పవచ్చు. లేకపోతే వీటితోపాటు పుట్టగొడుగులకు సైతం భారీ డిమాండ్ ఉన్నది. ఈమధ్య వీటిని తినేవారి సంఖ్య రోజుకి పెరుగుతూ ఉండడంతో వీరి డిమాండ్ కూడా భారీగానే ఉన్నది. అయితే వీటిని పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవలసి ఉంటుంది. డిమాండ్ బట్టి వీటి ద్వారా ఆదాయం భారీగానే లభిస్తుంది. ఏదైనా చిన్న స్థలంలో కూడా వీటిని పెంచవచ్చు.. అలాగే నాటి కోళ్ల పెంపకం కూడా మంచి లాభాలను అందిస్తుంది. బాగా కోళ్లను పెంచి అమ్మితే లక్షలలో కూడా నెలకి ఆదాయాన్ని సైతం తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: