Money: ఉద్యోగులకు గుడ్ న్యూస్ దీపావళి కానుకగా డబ్బు జమ..!!
2022-23 ఆర్థిక ఏడాదికి సంబంధించి వడ్డీని ఇప్పుడు జమ చేసినట్లు తెలుస్తోంది.. వడ్డీ రేటు ను 8.15 శాతం కేంద్రం నిర్ణయించినట్లుగా తెలియజేసింది. EPF ఖాతా ఉన్నవారికి ఈ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు అదే విధంగా అధికారికంగా పోర్టల్ తో పాటు టెస్ట్ మెసేజ్ ద్వారా మిస్డ్ కాల్ అలర్ట్ ద్వారా ఈజీగా వీటిని తెలుసుకోవచ్చు. అలాగే లాగిన్ పేజీలో UAN పాస్వర్డ్ లాగిన్ వల్ల కూడా EPF బ్యాలెన్స్ ను తెలుసుకోవచ్చు.
ఉమాంగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ ను ఓపెన్ చేసి ఇందులో ఈపీఎఫ్ సెక్షన్ లోకి వెళ్లి వ్యూ పాస్ బుక్ ఆప్షన్ ని ఎంచుకోవాలి.. ఆ తర్వాత UAN నెంబర్ ని ఎంటర్ చేసి ఓటిపి ఆప్షన్ ని ఎంచుకోవాలి. అలా మొబైల్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి.
7738299899 అనే నెంబర్ కు మెసేజ్ పంపడం ద్వారా కూడా EPF బ్యాలెన్స్ అయితే మనం తెలుసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ మొబైల్ నుంచి..EPFOHO అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి UAN నెంబర్ ని ఎంటర్ చేసి ఇంగ్లీష్ తెలుగు హిందీ వంటి లాంగ్వేజ్లలో ఎంటర్ చేసి అయినా పంపిస్తే బ్యాలెన్స్ మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు.