దీపావళి పండుగ రోజున ఇలా చేస్తే.. ఆ ఇంటికి డబ్బే డబ్బు..!!

Divya
దీపావళి పండుగ హిందువులకు ఒక ప్రత్యేకమైన పండుగని చెప్పవచ్చు.. ఈ దీపావళి పండుగను జరుపుకోవడం వల్ల శుభం కలుగుతుందని నమ్మకం అందరికీ ఉన్నది.. ధన త్రయోదశి తో ఈ పండుగ ప్రారంభం అవుతుంది ఐదు రోజులపాటు దీపావళి పండుగను చేసుకుంటూ ఉంటారు. ఈ ఏడాది నవంబర్ 11వ తేదీన దీపావళి పండుగ శనివారం ధన త్రయోదశి పూజను జరుపుకోవాలని జ్యోతిష్యులు సైతం తెలియజేస్తున్నారు.అందుచేతనే రాత్రి పూట చతుర్దతి శనివారం కావడంతో ఆ రోజునే దీపావళి లక్ష్మీ పూజను సైతం చేస్తూ ఉండాలట.. కాబట్టి 12 వ తారీఖున నరక చతుర్దశి చేసుకోవాల్సి ఉంటుంది.

12వ తారీకు రాత్రి నా అమావాస్య సమయంలో లక్ష్మీదేవి ని పూజించి దీపావళి పండుగ సైతం జరుపుకోవాలని ప్రముఖ జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 12వ తారీఖున అమావాస్య ఉండడం వలన లక్ష్మీదేవిని పూజిస్తే పూజ చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుందట. దీపావళి రోజున దీపారాధనలు పలు రకాల వాటిని ఆచరించాలని 13వ తారీఖున సోమవారం వ్రతము కేదర గౌరీ వ్రతం వంటివి చేయాలట. ఇక 14వ తారీకు నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. 14వ తేదీన బలిపాడ్యమి 15వ తారీఖున యమద్వితీయతో ఐదు రోజులపాటు ఈ దీపావళి పండుగను చాలా సస్యశ్యామలంగా జరుపుకోవాలని తెలియజేస్తున్నారు.

దీపావళి పండుగను ఉపవాసంతో చేయగలరు మంచి లాభాలు ఉంటాయట. దీపావళి ఉదయం లేవగానే తలకు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని లక్ష్మీ పూజను చేస్తే ఆ ఇంటికి అదృష్టం వరిస్తుందట. అంతేకాకుండా గోమాతకు సైతం భోజనం పెడితే ఆ ఇంటికి శుభం కలుగుతుందని పలువురు పండితుల సైతం తెలియజేస్తూ ఉన్నారు. దీపావళి పండుగ రోజున ఇంటిని దీపాలతో అలంకరించడం మంచింది. కొన్ని ప్రాంతాలలో టపాసులు కాల్చడం వంటివి కూడా బ్యాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే తగిన మోతాదులోనే టపాసులు కాల్చడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: