Money: రూ.10 పెట్టుబడితో భారీ ఆదాయం.. ఎలా అంటే.?

Divya
ప్రస్తుతం చాలామంది అధిక రాబడిని పొందడానికి వివిధ మార్గాలలో పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే .అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. ఎందుకంటే ఇందులో రిస్క్ తో కూడుకున్న పని.. కానీ రిస్క్ చేసి ఇందులో డబ్బులు పెడితే మాత్రం అతి తక్కువ సమయంలోనే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ నిపుణుల సలహాలు మేరకు ఏ ఏ కంపెనీలలో పెట్టుబడులు పెట్టాలో నిర్ణయించుకుంటే మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఆథమ్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక కంపెనీ ప్రధానంగా షేర్లు సెక్యూరిటీలలో పెట్టుబడి వ్యాపారాన్ని ఫైనాన్సింగ్ కార్యకలాపాలను కొనసాగించే ఒక నమోద  ఎన్బీఎఫ్సీ.. ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారికి గత మూడు సంవత్సరాల లో స్టెల్లార్ రిటర్న్ లు లభించినట్లు సమాచారం. సెప్టెంబర్ 28 2020 న రూ.10.07 వద్ద ముగిసిన మల్టీబాగర్ ఎన్ బి ఎఫ్ సి స్టాక్ విలువ ప్రస్తుతం బీఎస్ఈ లో రూ.482.60 కి చేరుకుంది. అంటే మూడు సంవత్సరాల కాలం వ్యవధిలోనే ఏకంగా 4,692 శాతం రాబడిని అందించింది అని చెప్పవచ్చు.

అంతేకాదు ఈ స్టాకు ఒక సంవత్సరంలో 106% పెరిగింది. ఇక ఈ సంవత్సరం ప్రారంభం నుండి 118.52 శాతం లాభపడింది అంటే కేవలం 6 నెలల్లోనే ఈ షేర్ 177.28% పెరిగి ఇన్వెస్టర్లకు భారీ ఆదాయాన్ని కలిగించింది. 2023 జూన్ తో ముగిసిన త్రైమాసికంలో 6135 పబ్లిక్ వాటాదారులు 28.53% వాటాను కలిగి ఉన్నారు. వీరిలో 5965 పబ్లిక్ వాటాదారులు 27.25 లక్షల షేర్ లను.. అంటే రూ .2లక్షల వరకు మూలధనంతో 1.60% వాటాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఇందులో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ ఆదాయం రెండు మూడు సంవత్సరాల లోనే భారీగా పెరుగుతుంది అని చెప్పవచ్చు. అయితే ఇందులో ఇన్వెస్ట్ చేసే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం తప్పనిసరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: