Money: వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో డబ్బు జమ..!

Divya

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా వైయస్ జగన్ ప్రజలకు ఎన్నో హామీలు ఇవ్వగా అందులో భాగంగానే తొలి సంక్షేమ పథకాలలో కూడా అమలుపరుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, కార్మికుల ఆర్థిక అవసరాల కోసం వివిధ పథకాలను అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఒక్కో వర్గానికి ఒక్క పథకాన్ని ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొస్తూ వారికి లబ్ధి చేకూరుస్తోంది.
ఇప్పటికే ఈ పథకాల ద్వారా చాలామంది లబ్ధి పొందారు. ఏపీ సర్కార్ అమలుపరుస్తున్న పథకాలలో వాహన మిత్ర పథకం కూడా ఒకటి.  తాజాగా లబ్ధిదారులకు జగన్ సర్కార్ శుభవార్త తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు జగన్ సర్కార్ శుభవార్తను తెలిపింది.  వైయస్సార్ వాహన మిత్ర స్కీమ్ లో భాగంగా ఈనెల 31వ తేదీన ఆటో, క్యాబ్, టాక్సీ డ్రైవర్ల ఖాతాలో రూ.10వేల చొప్పున జమ చేస్తున్నట్లు తెలిపింది. ఇక నేటితో కొత్త దరఖాస్తుకు గడువు పూర్తి అవుతుండగా రెండు రోజుల వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటుందని.. అయితే ఈసారి కొత్తగా రేషన్ సరఫరా చేస్తున్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ఆపరేటర్లకు కూడా నగదు చెల్లించనున్నట్లు సమాచారం.
ఇకపోతే గతేడాది 2.61 లక్షల మందికి లబ్ధి చేకూరగా ఈ ఏడాది ఆ సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.  ప్రతి సంవత్సరం ఈ పథకంలో చైర్మన్ లబ్ధిదారులకు పదివేల ఆర్థిక సహాయం అందిస్తుండగా ఇప్పుడు ఆ డబ్బులను లబ్ధిదారుల ఖాతాలో నేరుగా జమ చేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ ఆర్థిక సహాయం ఆటో టాక్సీ డ్రైవర్లకు వర్తిస్తుంది. ముఖ్యంగా వాహన మిత్ర పథకంలో చేరాలనుకున్నవారు సచివాలయంలో సంప్రదించవచ్చు లేదా ఆన్లైన్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఏపీ ట్రాన్స్పోర్ట్ వెబ్సైట్ కి వెళ్లి అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: