మనీ : ఎల్ఐసి లో అద్భుతమైన పాలసీ.. భారీ ఆదాయం పొందాలంటే..?
ఇకపోతే కస్టమర్లకు అనుగుణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా పలు రకాల సదుపాయాలను కల్పిస్తూ రకరకాల పాలసీలను రూపొందిస్తూ అందుబాటులోకి తీసుకొస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోని ఎల్ఐసి తీసుకొచ్చిన ఒక అద్భుతమైన పాలసీ మీకు మంచి ఆదాయాన్ని అందిస్తోంది. అదే జీవన్ లాభ్ పాలసీ. ఈ పాలసీలో భాగంగా మీరు ప్రతి నెల రూ.7,572 మాత్రం ఆదా చేస్తే చాలు మెచ్యూరిటీ సమయానికి రూ.54 లక్షల భారీ ఫండ్ పొందే అవకాశం ఉంటుంది.
ఇకపోతే పాలసీ తీసుకోవాలంటే తప్పనిసరిగా మీ వయసు 18 సంవత్సరాలు నుంచి గరిష్టంగా 59 సంవత్సరాలు ఉండాలి. ఇక ఎవరైనా సరే 25 సంవత్సరాల వయసులో ఈ జీవన్ లాభ్ పాలసీ తీసుకున్నట్లయితే అప్పుడు ప్రతి నెల అతను రూ.7,572 లేదా రోజుకు 262 రూపాయలు పెట్టుబడిగా పెట్టాలి. ఇక అప్పుడు ప్రతి ఏటా మీ ఖాతాలో రూ.90,867 జమ అవుతుంది. ఈ విధంగా మీరు దాదాపు 20 లక్షల రూపాయలను డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయం పూర్తయిన తర్వాత పాలసీదారు రూ.54 లక్షలు పొందుతారు.
అంతేకాదు ఇందులో మెచ్యూరిటీపై అదనపు బోనస్ ల తోపాటు రివసర్నరీ బోనస్ లభిస్తుంది. 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య ఉన్న పౌరులు ఎవరైనా సరే ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. రిస్క్ లేకుండా డబ్బులు సంపాదించాలనుకునే వారికి ఇది చక్కటి ఆదాయ పథకం అని చెప్పవచ్చు.