రైతు సోదరుల గొప్ప మనసు.. కిలో టమాట ఎంతో తెలుసా?

praveen
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఒకే విషయం గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. అదే భారీగా పెరిగిపోయిన టమాటా రేటు గురించి. ఇక ప్రస్తుతం కొండేక్కి కూర్చున్న టమాటా రేట్లు చూస్తే ఇక టమాటా అంటే కేవలం సంపన్నులకు మాత్రమే సంబంధించింది. సామాన్యులకు ఇక టమాటా అందనంత దూరంలో ఉంది అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఇప్పటికే మిగతా కూరగాయల ధరలు పెరిగిపోయాయి అని సామాన్యులు బెంబేలెత్తిపోతుంటే  ఇక ఇప్పుడు టమాటా ధర ఏకంగా 150 నుంచి 200 రూపాయల వరకు పలుకుతూ ఉండడంతో సామాన్యులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు.


 అయితే టమాటాను ప్రతి వంటకంలో తప్పనిసరిగా వాడాల్సిందే. టమాట లేదు అంటే ఏ వంటకానికి అయినా అసలు టేస్ట్ రాదు. కానీ ఇప్పుడు ఎంతోమంది సామాన్యులు టమాటా లేకుండానే వంటలు కానిచ్చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక మార్కెట్ కు వెళ్ళిన టమాట వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇలాంటి సమయంలో ఇక టమాటాకు ఉన్న డిమాండ్ దృశ్య కొంతమంది తమ వ్యాపారాలను మరింత పెంచుకునేందుకు వినూత్నమైన ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది మాత్రం సామాన్యులకు కాస్త ఉపశమనం కలిగించేలా తక్కువ ధరకు టమాటా విక్రయిస్తూ ఉండడం గమనార్హం.


 ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాటా ధరలు సగటున కేజీకి ₹200 పైగా పలుకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడు రైతు సోదరులు మాత్రం సామాన్యులకు ఉపశమనం కలిగించేలా మంచి మనసు చాటుకున్నారు. నీలగిరి జిల్లా కుందా గ్రామానికి చెందిన రామన్, పుట్ట స్వామి సోదరులు తమ పొలంలో పండే టమాటాలను లాభాపేక్ష లేకుండా కేవలం కిలో 80 రూపాయలకే విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు తమ గ్రామంలో 1000 కేజీల వరక విక్రయించామని.. అధికారులు భారీ ధర  ఆఫర్ చేసినప్పటికీ కూడా తాము ఆశపడలేదు అంటూ చెబుతున్నారు ఈ రైతు సోదరులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: