Money: అదిరిపోయే పాలసీ తో మళ్ళీ మన ముందుకు వచ్చిన ఎల్ఐసి..!

Divya
తాజాగా ఎల్ఐసి పలు రకాల ఇన్సూరెన్స్ పథకాలను ఆఫర్ చేస్తూ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా పాలసీని ఎంచుకునే విధంగా పలు మార్గాలను సులభతరం చేసింది. ఈ క్రమంలోనే ఎల్ఐసి పాలసీ ఆధారంగా వచ్చే బెనిఫిట్స్ కూడా మారుతాయని కస్టమర్లు గుర్తించుకోవాలి. అందుకే ఎల్ఐసి పాలసీలు ఎంపిక చేసుకునేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి. లేదంటే పాలసీ తీసుకున్నా కూడా దాని ప్రయోజనాలను పూర్తిగా పొందలేరు. ఇకపోతే ఎల్ఐసి అందిస్తున్న పాలసీలలో జీవన్ లాభ్ ప్లాన్ కూడా ఒకటి..

ఇందులో అనేక రకాల ప్రయోజనాలను పొందడంతో పాటు ఆర్థిక భద్రత కూడా పొందవచ్చు. ముఖ్యంగా ఇన్సూరెన్స్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే సేవింగ్ ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అంతేకాదు మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి భారీ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇక ఒకవేళ పాలసీదారుడు మరణించినట్లయితే నామినీ లేదా కుటుంబ సభ్యులకు ఆర్థిక రక్షణ ఉంటుందని.. అందుకే మీరు కూడా ఈ పాలసీ కొనుగోలు చేస్తే రెండు రకాల ప్రయోజనాలు కూడా పొందవచ్చని సమాచారం. ఇది ఒక ఎండోమెంట్ ప్లాన్ కాబట్టి దీని ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు సేవింగ్స్ కూడా పొందవచ్చు.

ఉదాహరణకు రూ.20 లక్షల బీమా మొత్తానికి మీరు పాలసీ తీసుకున్నట్లయితే మీ వయసు 30 సంవత్సరాల అనుకుంటే మీరు మెచ్యూరిటీ సమయంలో రూ .54 లక్షల రూపాయలు పొందవచ్చు. నెలకు రూ.7,572 మీరు ప్రీమియం కింద చెల్లించాలి. ఇక మీరు రోజుకు దాదాపు రూ.250 పొదుపు చేస్తే సరిపోతుంది.ఇక మీరు ఎంచుకునే బీమా ఆధారంగానే ప్రీమియం కూడా ఉంటుంది. 8 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు వయసు ఉన్న ఎవరైనా సరే ఈ ప్లాన్లో చేరడానికి అర్హులు. 16 సంవత్సరాల ప్లాన్ పెంచుకుంటే పది సంవత్సరాలు ప్రీమియం చెల్లించాలి. ఇలా మీరు తీసుకునే ప్లాన్ ని బట్టి లాభం పొందే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: