Money: వంటగది నుంచే డబ్బు సంపాదించే అవకాశం. ఎలా అంటే..?

Divya
ప్రస్తుత కాలంలో మహిళలు చాలా వరకు ఖాళీగా ఉండడానికి ఇష్టపడడం లేదు. కనీసం ఏదో ఒక పని చేసి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పెరిగిపోతున్న ఖర్చులు, భవిష్యత్తు భయం ఆర్థికంగా వేటాడుతోంది కాబట్టి చాలామంది ఆడవాళ్లు కూడా పనిచేసి డబ్బులు సంపాదించాలని కలలు కంటున్నారు. మరీ ముఖ్యంగా చాలామంది భారతీయ మహిళలు వ్యాపారవేత్తలు కావాలని అందులో సక్సెస్ అవ్వాలని యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందించే ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియాను మీకోసం తీసుకువచ్చాము ఇక అదే కెచప్ తయారీ.
మీరు కష్టపడకుండా మీ వంట గది నుంచి దీనిని తయారు చేసి మార్కెట్లో విక్రయించవచ్చు. ప్రస్తుతం పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ టమాటా కెచప్ లేదా సాస్ ను ఇష్టపడుతున్న నేపద్యంలో రెస్టారెంట్లు,  క్యాంటీన్లు,  హోటళ్లు,  ఫుడ్ స్టాల్స్ లేదా ఇళ్లల్లో కూడా ఇప్పుడు వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు.  అందుకే మీరు నాణ్యమైన టమోటాలను తీసుకొచ్చి ఇలా కెచప్ లేదా సాస్ తయారు చేసి విక్రయించవచ్చు. ఇక మీకు టమోటా కెచప్ తయారు చేయడం ఎలాగో తెలియకపోతే ప్రస్తుతం యూట్యూబ్ లేదా ఆన్లైన్లో చాలా రకాల తయారీ విధానాలు మీకు కనిపిస్తాయి వాటిని చూసి ఇబ్బంది లేకుండానే ఇంట్లో చాలా సింపుల్ గా దీనిని తయారు చేయవచ్చు.
ఇకపోతే ఇందుకోసం మీరు ఎం ఎస్ ఎం ఈ పరిశ్రమ విభాగంలో వ్యాపారాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.  వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు ఆన్లైన్ లైసెన్స్ అనేది తప్పనిసరి. ఇది అప్లై చేసిన 15 రోజుల్లో పై మీకు చేరిపోతుంది. ఇక మీరు మీ చుట్టుపక్కల ఇళ్ళకి కూడా దీనిని సప్లై చేసి డబ్బులు సంపాదించవచ్చు.  ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల వరకు రుణం అందిస్తున్న నేపథ్యంలో మహిళలు లోన్ తీసుకొని మరి వ్యాపారం మొదలు పెట్టవచ్చు. ఈ వ్యాపారం అయితే మీకు పెద్దగా ఖర్చు లేకుండా కష్టం లేకుండా మంచి ఆదాయాన్ని అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: