మనీ: అదిరిపోయే గొప్ప స్కీమ్.. అరకోటి వరకు లోన్..!
చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ విసిగిపోతూ సొంతంగా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్న వారి కోసం ఒక పథకం అందుబాటులో ఉంది.. ఎకానమీ 2024 కి ఐదు ట్రిలియన్ డాలర్లకు పెరగాలన్నది లక్ష్యంగా దానిని చేరుకోవాలంటే చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలకపాత్ర పోషిస్తాయి. కాబట్టి ఇవి ఎక్కువగా దేశంలో ఏర్పడితే దేశ ఎకానమీ కూడా అంతే పెరుగుతుంది కాబట్టి దీనికోసం అవసరమయ్యే నిధులను సబ్సిడీతో పాటు లోన్ రూపంలో అందించడానికి సిద్ధం అయ్యింది కేంద్ర ప్రభుత్వం..
ఇక ఆ స్కీం విషయానికి వస్తే ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం.. క్రెడిట్ లింక్ సబ్సిడీ పథకం ద్వారా చేయూతను అందిస్తోంది. కుటీర , మధ్య, చిన్న తరహా సంస్థల మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.. ఈ నేపథ్యంలోనే రాష్ట్రస్థాయిలో కె.వి.ఐ.సి, కె.వి.ఐ.బి, జిల్లా పరిశ్రమల సెంటర్ దీనిని నిర్వహించడం గమనార్హం. ఇకపోతే పీఎం ఈజీపి కింద లోన్ పొందవచ్చు. రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అంటే సుమారుగా అరకోటి వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది. అదే సర్వీస్ రంగంలో లోన్ పొందాలి అనుకుంటే పది లక్షల నుండి 25 లక్షలకు చేశారు అలాగే గ్రామీణ ప్రాంతాలకు చెందిన జనరల్ కేటగిరి వారికి 25% సబ్సిడీ ఇస్తే ఎస్సీ, ఎస్టీ , ఓబీసీ, మైనారిటీ , దివ్యాంగులకు 35% సబ్సిడీ ఉంటుంది. ఇక దరఖాస్తుల కోసం కెవిఐసి అధికారిక వెబ్సైట్ను సంప్రదించాల్సి ఉంటుంది.