మనీ: పీఎం కిసాన్ పొందే రైతులకు హెచ్చరిక..!

Divya
కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్నదాతలను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రత్యేకమైన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అదే ప్రధానమంత్రి కిసాన్ సన్మానిధి యోజన పథకం. ఇందులో చేరిన వారికి మోడీ సర్కారు ప్రతి సంవత్సరం ఉచితంగా బ్యాక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నారు. అర్హత కలిగిన రైతులకు ఉచితంగా ప్రతి సంవత్సరం 6000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతుంది. అయితే ఈ డబ్బు ఒకేసారి కాకుండా విడతల వారీగా మూడు విడతల్లో డబ్బు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి.
అంటే నాలుగు నెలలకు ఒకసారి 2000 చొప్పున మూడుసార్లు రైతుల ఖాతాలో డబ్బు జమ అవుతున్నాయి అన్నమాట. పిఎం కిసాన్ స్కీం కింద డబ్బులు పొందే రైతులు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలని లేకపోతే కేంద్రం కఠినంగా చర్యలు తీసుకుంటుంది అని తెలుస్తోంది. ఎవరైతే అర్హత లేకపోయినా కూడా పిఎం కిసాన్ స్కీం కింద డబ్బులు పొందుతూ ఉంటారో వారి నుంచి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఆ డబ్బులను వెనక్కి తీసుకోబోతోంది కాబట్టి అర్హత లేని వారు డబ్బులు వెనక్కి చెల్లించాల్సి ఉంటుందని కూడా ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి.

ముఖ్యంగా ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది పిఎం కిసాన్ స్కీం కింద డబ్బులు పొందుతున్నట్లయితే అలాంటి వారు కూడా డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుందట.. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పీఎం కిసాన్ స్కీం కింద డబ్బులు లభిస్తాయి మిగతా వారికి డబ్బులు లభించవు. ఒకవేళ ఆ డబ్బులు తిరిగి కేంద్రానికి చెల్లించకపోతే జైలుకు కూడా వెళ్లాల్సి రావచ్చు. ఇక ఛత్తీస్గఢ్లో ఇప్పటికే దాదాపు 50 వేల మందికి పైగా రైతులు అర్హత లేని వారు పిఎం కిసాన్ డబ్బులు పొందినట్లు మీడియా నివేదికలు తెలియజేస్తున్నాయి. అందుకే వీరందరినీ ప్రభుత్వం గుర్తించి డబ్బు వెనక్కి ఇవ్వాల్సిందిగా కోరుచున్నారు. డబ్బులు చెల్లించిన తర్వాత వారి పేరును పథకం నుండి తొలగిస్తారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: