మనీ: పోస్ట్ ఆఫీస్ నుంచి అద్భుతమైన పథకం.. రూ.100 ఆదాతో రూ.20 లక్షలు..,!

Divya

ప్రస్తుతం రకరకాల చిన్న పొదుపు పథకాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోని చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేటును ఏప్రిల్ ఒకటి నుంచి పెంచుతూ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది.  దీని ప్రకారం పోస్ట్ ఆఫీస్ పెట్టుబడికి మంచి ఎంపిక అని కూడా స్పష్టం చేసింది.. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ లో డబ్బు భద్రంగా ఉండటమే కాదు ఎక్కువ లాభం కూడా వస్తుంది. అ 
లాంటి పథకం ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లో అందుబాటులోకి వచ్చింది ఇందులో కేవలం నెలకు ₹100 పెట్టుబడి పెడితే రూ.20 లక్షలకు పైగా లాభం పొందవచ్చు.
పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఈ పథకం పేరు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం.. ఇది చిన్న పొదుపు పథకం అని చెప్పవచ్చు. ఇందులో కేవలం వంద రూపాయల పెట్టుబడితో వేరు పథకాన్ని ప్రారంభించవచ్చు.  పెట్టుబడిదారుడికి సంవత్సరానికి 6.8% వడ్డీ కూడా లభిస్తుంది. ఇకపోతే ఈ పథకం యొక్క కాలవ్యవధి ఐదు సంవత్సరాలు మాత్రమే. పెట్టుబడిదారులు కొన్ని షరతులతో ఒక సంవత్సరం తర్వాత ఖాతా నుండి డబ్బులు తీసుకుని వెసులుబాటు కూడా కల్పించారు. ఇకపోతే ఆర్థిక సంవత్సరంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. పైగా పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.  కాబట్టి పెట్టుబడిదారులు నిరబ్యంతరాయంగా ఈ పథకం 
లో డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఉదాహరణకు పథకం లో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఐదు సంవత్సరాల తర్వాత నికర లాభం రూ.1,38,949 అవుతుంది ఇక మరి మీరు ఐదు సంవత్సరాల తర్వాత రూ.20.85 లక్షలు పొందాలి అనుకుంటే ఈ పథకం లో 15 లక్షలు పెట్టుబడి పెడితే వడ్డీ కింద ఆరు లక్షల రూపాయల లాభం లభిస్తుంది. ఇక ఇంతకంటే మంచి బెనిఫిట్ అందించే స్కీం మరొకటి లేదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: