మనీ: ఎల్ఐసి నుంచి అదిరిపోయే పాలసీ.. రూ.50 లక్షలు పొందే అవకాశం..!
ఇకపోతే ఫార్ట్ టర్మ్ పేమెంట్ ఆప్షన్ మీరు ఉపయోగించి డబ్బులు చెల్లించవచ్చు. మెచ్యూరిటీ సమయంలో బోనస్గా వీటిని పొందే అవకాశం ఉంటుంది. ఇకపోతే మీరు ఇందులో పాలసీ తీసుకోవాలి అంటే మినిమం రూ.5 లక్షల మొత్తానికి పాలసీ తీసుకోవాలి. పుట్టిన ఏడాది నుంచి 55 సంవత్సరాల వరకు వయసు ఉన్న ఎవరైనా సరే ఈ ప్లాన్లో ఖాతా తెరవచ్చు. పాలసీ ప్రీమియం మొత్తాన్ని నెల 3 నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున మీరు చెల్లించే అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్లాన్ టర్మ్ 15 ఏళ్లు , 20 ఏళ్లు, 25 ఏళ్లుగా నిర్ణయించబడింది. కాబట్టి మీరు ఎంచుకున్నా.. తక్కువ కాలం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు మీకు 30 సంవత్సరాల వయసు ఉంది అనుకుంటే.. 25 సంవత్సరాల టర్మ్ తో రూ.20 లక్షల బీమా మొత్తానికి ఈ ప్లాన్ తీసుకున్నట్లయితే మెచ్యూరిటీ సమయంలో రూ. 40 లక్షలు, అదనంగా మరో రూ.5 లక్షల వరకు మీకు లభిస్తాయి. ప్రతిరోజు రూ.320 పొదుపు చేస్తే నెలకు రూ. 9600 పే చేయాల్సి ఉంటుంది. ప్రీమియం రూపంలో మీరు చెల్లించే మొత్తం రూ.24 లక్షల అవుతుంది. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే డెత్ క్లైమ్ కింద రూ.40 లక్షలు లభిస్తాయి.. అదే ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.50 లక్షల బీమా లభిస్తుంది.