మనీ: డ్వాక్రా మహిళలకు శుభవార్త తెలిపిన జగన్ సర్కార్..!
పూర్తి వివరాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటి వరకు మహిళలకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఇప్పుడు డ్వాక్రా మహిళలకు కూడా జగన్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.. వైయస్సార్ ఆసరా మూడో విడత కింద 78 లక్షల మంది డ్వాక్రా మహిళల ఖాతాలో సుమారుగా రూ. 6,400 కోట్ల రూపాయలను సీఎం జగన్ జమ చేయబోతున్నారు. ఇకపోతే ఈ మేరకు ఖాతాలో డబ్బు జమ చేయడానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు ఈనెల 25వ తేదీన ఏలూరు జిల్లా దెందలూరులో భారీ ఎత్తున జరిగే ఈ కార్యక్రమంలో జగన్ బటన్ నొక్కి డ్వాక్రా మహిళల ఖాతాల్లో డబ్బు జమ చేయబోతున్నారు.
వైయస్సార్ ఆసరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జగన్ సర్కార్ ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758 కోట్లను డ్వాక్రా మహిళల ఖాతాల్లో డబ్బులను జమ చేసింది ప్రభుత్వం. ఇక ఈనెల 25వ తేదీన మొదలయ్యే ఈ కార్యక్రమం ఏప్రిల్ వరకు కొనసాగబోతోంది. ముఖ్యంగా అన్ని నియోజకవర్గాల్లోని ఎంపీ , ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ నగదు పంపిణీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. డ్వాక్రా మహిళలు తీసుకున్నారు రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి వడ్డీ రూపంలో చెల్లిస్తోంది. ఒక రకంగా వైయస్సార్ ఆసరా మహిళలకు మరింత ఆసరాగా నిలవబోతోందని చెప్పాలి.