మనీ: రైతులకు శుభవార్త తెలిపిన మోడీ ప్రభుత్వం.. రూ.42 వేలు జమ..!
ఇకపోతే ఇప్పటికే ఈ పథకంలో చాలామంది రైతులు చేరి లబ్ధి పొందుతున్నారు. బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు , రేషన్ కార్డు, పొలం పట్టా వంటివి ఉంటే ఈ పథకంలో చేరడానికి అర్హులవుతారు. ఉచితంగానే మీరు ఈ పథకంలో చేరి ప్రతి ఏటా 6000 రూపాయలను పొందవచ్చు. ఇకపోతే రైతన్నల కోసం మరో పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీనిపేరు పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన . ఇందులో రైతులకు ప్రతినెల 3000 రూపాయలు లభిస్తాయి అంటే సంవత్సరానికి 36వేల రూపాయలను పొందవచ్చు.
అయితే 18 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే నెలకు 55 రూపాయలు కట్టాలి. అలాగే గరిష్టంగా 200 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఇలా ప్రతి నెల డబ్బులు కడుతూ వెళ్ళాలి.. రైతులకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి నెల 3000 రూపాయలు లభిస్తాయి. ఈ లెక్కన చూసుకుంటే రెండు పథకాలకు సంబంధించి సుమారుగా రూ.42,000 మీ ఖాతాలో జమవుతాయి. మొత్తానికైతే ఈ రెండు పథకాలు రైతులకు మంచి లాభాన్ని అందిస్తున్నాయి.