మనీ: అధిక వడ్డీ పొందాలి అంటే ఈ పోస్ట్ ఆఫీస్ స్కీం లో చేరాల్సిందే..!
సీనియర్ సిటిజనులకు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భరోసా ఇవ్వడానికి ఇలా పోస్ట్ ఆఫీస్ లో అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. ఈ స్కీం లో సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీం కూడా ముఖ్యమైనది. కాబట్టి దాని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు 1000 రూపాయలతో ఈ పథకాన్ని ప్రారంభించి గరిష్టంగా రూ. 15 లక్షల వరకు ఈ పథకంలో మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే ఈ స్కీం యొక్క కాలపరిమితి కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే. ఈ స్కీం కింద 8% వడ్డీ కూడా లభిస్తోంది. 60 ఏళ్లు దాటిన వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. కాబట్టి ప్రతి మూడు నెలలకు వడ్డీరేట్లను ప్రభుత్వం మారుస్తున్న నేపథ్యంలో మీ వడ్డీ రేట్లు మారే అవకాశం ఉంది.
ప్రస్తుతం దీని లిమిట్ రూ.15 లక్షలు ఉంది. ఈ స్కీం కాల పరిమితి ఐదు సంవత్సరాలు కావాలంటే మీరు మరో మూడు సంవత్సరలు పెంచుకోవచ్చు. టాక్స్ బెనిఫిట్స్ కూడా ఈ పథకం ద్వారా పొందుతారు.