మనీ: తక్కువ పెట్టుబడితో నెలకు రూ.లక్షకు పైగా ఆదాయం.. ఎలా అంటే..?

Divya
మీలో బిజినెస్ చేయడమే లక్ష్యంగా ఆలోచన ఉన్నట్లయితే మీకోసం ఒక చక్కటి బిజినెస్ ఐడియాను తీసుకురావడం జరిగింది. ఈ బిజినెస్ చేస్తే యువత ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే సొంత ఊర్లోనే మంచి ఆదాయం కూడా పొందవచ్చు. అంతేకాదు కేవలం కొన్ని గంటలు మీరు కష్టపడితే చాలు ఈ బిజినెస్ ద్వారా చక్కటి ఆదాయాన్ని కూడా పొందవచ్చు. మరి అలాంటి బిజినెస్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
ప్రస్తుతం అగరబత్తీలతో పాటు సాంబ్రాణి కప్స్ కి కూడా మంచి డిమాండ్ ఉంది. ప్రతి ఇంట్లో కూడా పూజ చేసే సమయంలో ప్రత్యేకంగా వార దినాలలో అగరవత్తులు ముట్టించడంతోపాటు సాంబ్రాణి కప్స్ కూడా వెలిగిస్తున్నారు. ముఖ్యంగా సాంబ్రాణి వాసన ఆరోగ్యానికి మంచిది కాబట్టి చాలామంది సాంబ్రాణి కప్స్ వాడకం పెంచుతున్న నేపథ్యంలో దీనినే మీరు వ్యాపార అవకాశంగా మార్చుకొని ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. నిజానికి సాంబ్రాణి కప్స్ వాసన చాలా బాగుంటుంది కాబట్టి కస్టమర్లు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
మీరు కూడా సాంబ్రాణికప్స్ తయారు చేయాలనుకుంటే ఈ వ్యాపారానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి. అప్పుడే మీ ఉన్న ఊరిలోనే ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టి మంచి లాభం పొందవచ్చు. అయితే సాంబ్రాణి కప్స్ తయారీకి ఒక సాంబ్రాణి మేకింగ్ మిషన్ కొనుగోలు చేయాలి. దీని ధర సుమారుగా రూ.2 లక్షల వరకు ఉంటుంది. ఇండియా మార్ట్ వెబ్సైట్ ద్వారా మీరు ఈ మెషిన్ కొనుగోలు చేయవచ్చు. మేకింగ్ మిషన్ కొనుగోలు చేసిన తర్వాత మేకింగ్ విధానం పై కొద్దిగా శిక్షణ తీసుకొని మీరు మొదలు పెట్టవచ్చు. ప్యాకింగ్ కోసం మరో చిన్న యంత్రం కూడా మీకు అవసరం అవుతుంది. ఒకవేళ మీరు ఏర్పాటు చేసుకున్న బ్రాండ్ లోగో కనబడేలా ఆకర్షణీయంగా మీరు ప్యాక్ చేస్తే సేల్స్ కూడా చక్కగా అవుతాయి. మార్కెటింగ్ లో మీకు మంచి ప్రావీణ్యం ఉన్నట్లయితే మీ ప్రోడక్ట్ కు మీరే మార్కెటింగ్ చేసుకొని మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: