మనీ: ఈ బిజినెస్ మొదలు పెడితే లాభాలే లాభాలు.. !

Divya
సొంతంగా మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలి అనుకున్నట్లయితే మీకోసం ఒక చక్కటి అధిక లాభాన్ని ఇచ్చే బిజినెస్ ఐడియాను తీసుకురావడం జరిగింది.. అదే ఐస్ క్రీమ్ పార్లర్.. ప్రస్తుతం మరికొద్ది రోజుల్లో వేసవి రోజులు రాబోతున్నాయి. కాబట్టి ఇప్పటినుంచే మీరు ఐస్ క్రీమ్ పార్లర్ నిర్వహించినట్లయితే ఈ వేసవికాలం మొత్తం మీరు అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ఏదైనా మీరు బిజినెస్ చేయాలనుకున్నప్పుడు సీజన్ కి అనుగుణంగా వ్యాపారం చేస్తే నష్టాలు కాకుండా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మరి కొద్ది రోజుల్లో వేసవికాలం రాబోతోంది కాబట్టి ఐస్ క్రీమ్లకు ఫుల్ డిమాండ్ పెరుగుతుంది . ఇలాంటి సమయంలో మీరు ఐస్ క్రీమ్ బిజినెస్ చేపట్టినట్లయితే పెట్టుబడికి మించి లాభాలు పొందవచ్చు.
పెట్టుబడి విషయానికి వస్తే 20, 000 రూపాయల సాధారణ పెట్టుబడితో వ్యాపారాన్ని మొదలుపెట్టి.. వ్యాపారం పెరిగే కొద్దీ పెట్టుబడి బాగా పెట్టవచ్చు. దేశంలో ప్రతి ప్రాంతంలో కూడా ఈ వ్యాపారం బాగా సక్సెస్ అవుతున్న నేపథ్యంలో మీరు ఎప్పుడు ఎక్కడి నుంచైనా కూడా ప్రారంభించవచ్చు . ఉదాహరణకు 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐస్ క్రీమ్ పార్లర్ ను ప్రారంభిస్తే పదిమందికి సీటింగ్ ఏర్పాటు చేయవచ్చు.  అలాగే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నివేదిక ప్రకారం దేశంలో ఐస్క్రీం వ్యాపారం ప్రతి ఏడాది చివరినాటికి ఒక బిలియన్  దాటుతుందని సమాచారం.
ఐస్ క్రీమ్ పార్లర్ కోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి కూడా లైసెన్స్ తీసుకోవాలి . 15 అంకెల రిజిస్ట్రేషన్ నెంబర్ మీ స్థలంలో తయారు చేసిన ఆహార పదార్థాల యొక్క నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా కూడా దీనిని నిర్ధారిస్తారు.  కాబట్టి నాణ్యమైన ఆహార పదార్థాలను తయారు చేసి మీరు సర్టిఫికెట్ పొందవచ్చు.  ఆ తర్వాత నిరభ్యంతరాయంగా వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: