మనీ: జన్ ధన్ ఖాతాదారులకు శుభవార్త తెలిపిన కేంద్రం..!

Divya
బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పథకం కింద దేశంలోని దాదాపు 47 కోట్ల మంది ప్రజలు ఖాతాలు తెరిచారు. ఈ ఖాతాదారులకు ఇప్పుడు పదివేల రూపాయలు నగదు బదిలీ చేయబడుతోంది అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇందుకోసం మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా ఇప్పుడు ఒకసారి చూసి తెలుసుకుందాం.
ఎవరైతే జన్ ధన్ ఖాతా లో  భాగస్వాములు అవుతారో వారికి రూ.1.30 లక్షల బీమా లభిస్తుంది. అంతేకాదు పదివేల రూపాయలను లోన్ కింద పొందవచ్చు.  ఒకవేళ ఇప్పటివరకు మీరు ఈ డబ్బు తీసుకోకపోతే.. ఈ పథకం కింద ఇలా దరఖాస్తు చేసుకోండి.. జన్ ధన్ ఖాతా తెరవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ప్రజలకు అందుతాయి.  ఇందులో ఖాతాదారునికి లక్ష రూపాయల ప్రమాద బీమా కూడా లభిస్తుంది.  అలాగే జీవిత బీమా కూడా పొందుతారు.  మరో 30 వేల రూపాయలు అదనంగా లభిస్తుంది. ఇక్కడ ఖాతాదారుడు మరణిస్తే నామినీకి లక్ష రూపాయలు అందుతుంది.  ఒకవేళ సాధారణ పరిస్థితిలో మరణించిన కూడా వారికి 30 వేల రూపాయలు అందజేస్తారు.
ఈ క్రమంలోనే మీరు పదివేల రూపాయలను బ్యాంకు నుండి పొందాలి అంటే ముందుగా మీ పేరు మీద జన్ ధన్ ఖాతా పథకం నుంచి ఖాతా తెరిచి ఉండాలి. ఒకవేళ మీరు ఈ పథకం యొక్క ఖాతాను ఇంకా తెరవకపోతే వెంటనే మీకు సమీపంలో ఉన్న ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకుకు వెళ్లి ఖాతాను తెరవచ్చు. ముందుగా ఆధార్ కార్డు,  పాన్ కార్డు తో పాటు బ్యాంక్ అప్లికేషన్ సబ్మిట్ చేసి ఖాతాను తెరవచ్చు. ఇలా ఖాతా ఓపెన్ చేసుకుంటే చాలు మీ ఖాతాలో పదివేల రూపాయలు బదిలీ చేయబడుతుంది.  ఇప్పటికే ఈ ఖాతా ఉన్నవారు పదివేల రూపాయలను పొందక పోయి ఉంటే బ్యాంకులో సంప్రదిస్తే అన్ని వివరాలు తెలియజేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: