మనీ: పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న అత్యుత్తమ పథకాలు ఇవే..!

Divya
ఈమధ్య కాలంలో చాలామంది సంపాదించిన డబ్బును భవిష్యత్తు తరాల కోసం దాచి పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సంపాదించిన డబ్బును ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన కొన్ని రకాల పథకాలలో ఇన్వెస్ట్ చేసినట్లయితే.. మీకు తక్కువ కాలంలోనే ఎక్కువ రాబడి వస్తుంది. అంతేకాదు రిస్క్ లేనిది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ లో పథకాలు కస్టమర్లకు సురక్షితమని.. నమ్మకమైన భరోసాని కూడా ఇస్తున్నాయి. దేశంలో పౌరుల కోసం పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు అనేక రకాల పొదుపు పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా పిల్లల నుంచి వృద్దుల వరకు అనేక ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా ఈ పథకాలలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఇందులో కొన్ని అత్యుత్తమమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే రాబడి బాగా పొందడంతో పాటు అనేక ప్రయోజనాలు కూడా పొందవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన:
ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా తల్లిదండ్రులు తమ కుమార్తెల భవిష్యత్తుకు భద్రత కల్పించవచ్చు. సుకన్య సమృద్ధి యోజన పథకం కింద పది సంవత్సరాల లోపు ఆడపిల్లల పేరు మీద ఖాతా తెరవడానికి అవకాశం ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడికి ప్రభుత్వం 7.6% వడ్డీ రేటును నిర్ణయించింది. ఈ పథకం కింద మీరు సంవత్సరానికి కనిష్టంగా రూ.250 నుండి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
కిసాన్ వికాస్ పత్ర:
మీరు మీ డబ్బులు రెట్టింపు చేసుకోవాలనుకుంటే ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల మీ డబ్బు రెట్టింపు అవుతుంది. ఈ పథకంలో మీకు 6.9% వడ్డీ లభిస్తోంది.  అయితే ఇప్పుడు దానిని కేంద్ర ప్రభుత్వం 7.0 శాతానికి పెంచింది. ఈ పథకంలో పెట్టుబడి మొత్తం 124 నెలల్లో రెట్టింపు అయ్యేది.  కానీ ఇప్పుడు 123 నెలల్లోని రెట్టింపు అవుతుంది. 18 సంవత్సరాల పైబడిన వారు ఇందులో డబ్బు పొదుపు చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: