మనీ: ఎల్ఐసి అందిస్తున్న ఈ పథకంతో కోటీశ్వరులు మీరే..!
ముఖ్యంగా ఎల్ఐసి ధన్ వర్షా ప్లాన్ రెండు ఆప్షన్స్ తో లభిస్తుంది. టర్మ్ కూడా వేరువేరుగా ఉంటుంది. 15 సంవత్సరాల టర్మ్ పాలసీకి కనీస వయసు మూడు సంవత్సరాలు.. అయితే 10 సంవత్సరాల కూడిన పాలసీకి కనీస వయసు పది సంవత్సరాలు. కనీస మెచ్యూరిటీ వయసు 18 సంవత్సరాలు. అయితే ఇది కేవలం సింగిల్ ప్రీమియం పాలసీ మాత్రమే.. అంటే ఈ ప్రీమియం మీరు ఒక్కసారి చెల్లిస్తే చాలు. ఉదాహరణకు మీకు 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 15 సంవత్సరాల టర్మ్ తో పాలసీ తీసుకుంటే ఎల్ఐసి ధన్ వర్ష ప్లాన్ తీసుకున్నట్లయితే సింగిల్ ప్రీమియం జిఎస్టి తో కలిపి రూ.8,34,652 చెల్లించాలి.
బేసిక్ సమ్ అస్యూర్డ్ రూ.10,00,000. సమ్ అస్యూర్డ్ ఆన్ డెత్ రూ.79,87,000 లభిస్తుంది. బెనిఫిట్స్ విషయానికి వస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.16 లక్షల బెనిఫిట్ లభిస్తుంది. గ్యారెంటీ ఆడిషన్స్ తో డెత్ బెనిఫిట్ కింద రూ. 85 లక్షల వరకు
పొందవచ్చు. ఒకవేళ బేసిక్ సమ్ అస్యూర్డ్ కింద రూ. 12 లక్షల తీసుకుంటే కోటి రూపాయల వరకు బెనిఫిట్ లభిస్తుంది. ఇంతకంటే బెస్ట్ పాలసీ మరొకటి లభించదని చెప్పవచ్చు.