మనీ: ఒకేసారి రెండు శుభవార్తలు తెలిపిన బజాజ్ ఫైనాన్స్.!
ముఖ్యంగా కొత్త స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లో చేరితే ఆకర్షణీయమైన రాబడి పొందవచ్చు. అలాగే 39 నెలల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం పై కస్టమర్లకు 7.6% వడ్డీ కూడా ఆఫర్ చేస్తోంది. అయితే ఇది రెగ్యులర్ కస్టమర్లకు వర్తిస్తుంది. కానీ సీనియర్ సిటిజన్స్ కి అయితే 7.85% వరకు వడ్డీని సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎవరైతే బజాజ్ ఫైనాన్స్ 44 నెలల ఫిక్స్ డిపాజిట్ చేస్తారు దానిపై 7.7% వడ్డీ లభిస్తోంది. అదే సీనియర్ సిటిజన్స్ కు 7.95% వడ్డీ అందిస్తోంది. ముఖ్యంగా ఈ రేట్ల పెంపు నిర్ణయం ఇప్పటికే అమలులోకి వచ్చినట్లు బజాజ్ ఫైనాన్స్ స్పష్టం చేసింది.
ఒకవేళ 12 నెలల నుంచి 23 నెలల టెన్యూర్ లోని కమ్యూలేటివ్ ఫిక్స్ డిపాజిట్ ల పై 6.8% వడ్డీ అలాగే 24 నెలల నుంచి 35 నెలల కమ్యూలేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్ లపై 7.25% వడ్డీని ఆఫర్ చేస్తోంది. అలాగే 36 నెలల నుంచి 60 నెలల మధ్య ఫిక్స్ డిపాజిట్ లపై 7.5% వడ్డీని అందిస్తోంది.ఇలా సరికొత్త స్కీం తీసుకురావడంతో పాటూ సరికొత్త ఆకర్షణీయమైన వడ్డీరేట్లను కూడా ఆఫర్ చేస్తోంది. రూ.5కోట్ల లోపు చేసే డిపాజిట్లకు ఈ వడ్డీ రేటు వర్తిస్తుందని స్పష్టం చేసింది