మనీ: ఇలా చేశారంటే మీ వృద్ధాప్యం సెటిల్ అయినట్టే..!

Divya
ఎవరైనా సరే వయసు పైబడే కొద్ది ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకూడదని ఆలోచిస్తూ ఉంటారు. అయితే వృద్ధాప్యంలో సెటిల్మెంట్ కావాలి అంటే మీరు ఇప్పటినుంచే పొదుపు చేయడం మంచిది. పెన్షన్ రూపంలో ఆర్థికంగా అండ లభిస్తుంది. కాబట్టి వృద్ధాప్యంలో ఎటువంటి చీకు చింత లేకుండా జీవితాన్ని గడపవచ్చు. ప్రభుత్వం నుంచి అనేక పెన్షన్ పథకాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ప్రజలు తమకు కావలసిన పెన్షన్స్ కి ఎంచుకునే డబ్బులు పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. అలాంటి వాటిలో నేషనల్ పెన్షన్ సిస్టం స్కీం కూడా ఒకటి.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పెట్టుబడి పథకంగా నేషనల్ పెన్షన్ సిస్టం స్కీంకు మంచి పేరుంది. ఇందులో డబ్బులు దాచుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు.  ముఖ్యంగా మీ డబ్బులు డెట్, ఈక్విటీలోకి వెళ్తాయి. అలాగే 75% డబ్బులను ఈక్విటీలోకి మిగతా 25% డబ్బులను డెట్ లోకి మళ్ళించవచ్చు. ముఖ్యంగా ఖాతాదారులు తమ రిస్క్ ప్రొఫైల్ ని బట్టి 40:60 నిష్పత్తి లేదా 50:50 నిష్పత్తి కూడా ఎంచుకోవచ్చు. ఈ పథకంలో నెలకు రూ. 15, 000 చొప్పున 30 సంవత్సరాల పాటు పొదుపు చేస్తే 60 సంవత్సరాల వయసు తరువాత రోజు నుంచి మీకు రెండు లక్షలకు పైగా పెన్షన్ లభిస్తుంది.

అది ఎలా అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి వయసు 30 సంవత్సరాలు ఉందనుకుంటే.. నెలకు రూ.15000 చొప్పున 30 సంవత్సరాల పాటు నేషనల్ పెన్షన్ సిస్టం స్కీమ్ లో పొదుపు చేస్తే డెట్ 40% , ఈక్విటీ 60% నిష్పత్తి ఎంచుకుంటే 30 సంవత్సరాల తర్వాత రూ.68,380 పెన్షన్ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి మీ చేతికి రూ.2.05కోట్లు లభిస్తాయి. వార్షిక వడ్డీ 8 శాతం చొప్పున లెక్కిస్తే నెలకు రూ.1.55 లక్షలు మీ చేతికి వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: